అన్‌లాక్‌లోనూ ‘అన్నీ ఓపెన్‌’ బీకేర్‌ఫుల్

Published: Thursday October 08, 2020

లాక్‌డౌన్‌ à°•à°¥ ముగిసింది! అన్‌లాక్‌లోనూ ‘అన్నీ ఓపెన్‌’ అనే దశ మొదలైంది. అక్టోబరు... అసలే పండగల సీజన్‌! ఇదే సమయంలో దాదాపు అన్ని రకాల సామాజిక కార్యకలాపాలకు కేంద్రం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చేసింది. à°ˆ నేపథ్యంలో కరోనా మరింత విజృంభించే అవకాశముందని... ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15à°µ తేదీ నుంచి ‘అన్‌లాక్‌ 5’ మొదలవుతోంది.  తాజా మార్గదర్శకాల్లో భాగంగా ఉత్సవాలకు, ఊరేగింపులకు అనుమతి ఇచ్చారు. త్వరలో  దసరా నవరాత్రులు మొదలు కానున్నాయి. ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. తిరుమలలో జరిగే దసరా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను జరపాలని, భక్తులను కూడా అనుమతించాలని నిర్ణయించారు. పండగ సీజన్‌లో షాపింగ్‌ సందడి కూడా జోరుగానే ఉంటుంది. దుకాణాలు కిటకిటలాడే అవకాశముంది. ఇలాంటి చోట్ల భౌతిక దూరం పాటించడం దాదాపుగా అసాధ్యమే. à°ˆ నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇక కరోనా దెబ్బకు దాదాపు ఆరు నెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు... వాటికీ షరతులతో కూడిన అనుమతి లభించింది. థియేటర్ల కెపాసిటీలో 50 శాతం టికెట్లే విక్రయించాలని, ఇంటర్వెల్‌ సమయం పెంచాలని, హాలులోకి ప్రేక్షకులు గుంపులు గుంపులుగా వెళ్లకుండా చూడాలని రకరకాల జాగ్రత్తలు చెప్పారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, ఒక్కసారి ‘గేట్లు తెరిచాక’ జనం ఇవన్నీ పాటిస్తారా... అనేది సందేహమే!  నిబంధనల అమలును పర్యవేక్షించే వ్యవస్థ కూడా లేదు. అందువల్ల... సినిమాలకు  వెళ్లాలనుకునే వారు అత్యంత జాగ్రత్తగా ఉండక తప్పదు. ఇక... మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లకూ ‘ఫ్రెండ్స్‌’తో దూకుడుగా వెళితే, కరోనా బారిన పడటే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

పాఠశాలలను తెరుచుకునేందుకు కూడా కేంద్రం అనుమతిచ్చింది. అయితే, à°ˆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతిని తప్పనిసరి చేసింది. నిజానికి... సందేహాల నివృత్తి కోసం 9, 10 తరగతుల పిల్లలు ఇప్పటికే స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అక్కడక్కడ ట్యూషన్లు కూడా జరుగుతున్నాయి. ఇలా ట్యూషన్లకు వెళ్లిన పిల్లలకు వైరస్‌ సోకిన ఉదంతాలు ఇప్పటికే కలకలం సృష్టించాయి. పిల్లల ద్వారా ఇళ్లలో ఉన్న పెద్దలకూ కరోనా వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు... పాఠశాలల పునఃప్రారంభం, పిల్లలను బడికి పంపే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు.

 

గతంతో పోల్చితే ఏపీలో కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. కానీ... ఇప్పటికీ వేల మంది కరోనా బారిన పడుతున్నారు.   à°šà°¾à°²à°¾ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇప్పుడు అన్‌లాక్‌ 5.0లో భాగంగా థియేటర్లు, మాల్స్‌ తెరుచుకుని... ఊరేగింపులూ, ఉత్సవాలు కూడా జరిగితే కేసులు మళ్లీ పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే... అక్టోబరు నెలను సంధికాలంగా చెబుతున్నారు.