రైతులు బాగుపడొద్దా?

Published: Thursday October 08, 2020

రైతులకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను సవరించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలతో కర్షకుడికి ఎలాంటి నష్టమూ ఉండబోదన్నారు. చట్ట సవరణలపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో వివరించేందుకు బుధవారం ఆమె కృష్ణాజిల్లాలో పర్యటించారు. విజయవాడలో రైతులు, వ్యవసాయ నిపుణులతో సమావేశం నిర్వహించారు.

 

విలేకరుల సమావేశంలోనూ à°ˆ చట్టల గురించి వివరించారు. గన్నవరం నియోజకవర్గం జక్కులనెక్కలం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. à°ˆ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ ‘à°ˆ సంస్కరణలు ఇవాళ్టివి కావు. రాద్ధాంతం చేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ ఏపీఎంసీలను రద్దు చేస్తామని మేనిఫెస్టో పెట్టలేదా? కేంద్రప్రభుత్వం ఎక్కడా రాష్ట్రాల హక్కులను లాక్కోలేదు. మార్కెట్ల బయట జరిగే లావాదేవీలపై ఎలాంటి కమీషన్లు వసూలు కాకుండా చూడటమే à°ˆ చట్టాల ఉద్దేశం. పొరుగురాష్ట్రాల్లో తన పంటను విక్రయించుకునే అవకాశం రైతులకు కల్పించడంతో దళారులు మాత్రమే ఇబ్బంది పడతారు. గుజరాత్‌లోని కచ్‌, ఏపీలోని రాయలసీమ ప్రాంతాల పండ్ల తోటల రైతులు బాగుపడితే మీకు ఇబ్బందేంటి?’ అని ప్రతిపక్షాలను నిర్మల నిలదీశారు. ‘రైతుల ఆదాయాన్ని 2023నాటికి రెట్టింపు చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే కరోనా సమయంలోనూ 3 బిల్లులకు సవరణ చేశాం’ అని చెప్పారు.

 

కాంగ్రెస్‌ సహా వివిధ ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు రాజకీయ లబ్ధి కోసం ఆందోళనలు నిర్వహిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆమె ఆరోపించారు. 14à°µ ఆర్థికసంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ముగిసిన అధ్యాయమని నిర్మల స్పష్టం చేశారు. కాగా, ఏపీలో ఏడాదిన్నరగా వ్యవసాయ పనిముట్లు, ఇతర యంత్రాలు రైతులకు ఇవ్వడంలేదని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌ రెడ్డి కేంద్రమంత్రికి ఫిర్యాదుచేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని జక్కులనెక్కలం రైతులు కకోరారు.