కరోనాతో మరో 16 మంది మృతి

Published: Friday October 23, 2020

రాష్ట్రంలో కరోనా వైరస్‌ అలజడి కొనసాగుతూనే ఉంది. à°—à°¤ 24 గంటల్లో 76,726 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,620 కొత్త కేసులు బయటపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,96,919à°•à°¿ పెరిగింది.తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో 680 కేసులు నమోదవగా.. తూర్పుగోదావరిలో 492, చిత్తూరు జిల్లాలో 412 మందికి వైరస్‌ సోకింది. కాగా కరోనాతో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,524à°•à°¿ పెరిగింది. గుంటూరు జిల్లాలో నలుగురు కరోనాతో చనిపోగా.. చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, అనంతపురం, à°•à°¡à°ª, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రంలో 3,723 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 7,58,138à°•à°¿ పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,257 యాక్టివ్‌ కేసులున్నాయి. 

పశ్చిమలో కరోనా కలవరం..

పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం కొత్తగా 680 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 88,226à°•à°¿ చేరింది. కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 486à°•à°¿ చేరింది. తూర్పుగోదావరిలో కొత్తగా 492 మందికి వైరస్‌ సోకింది. మరణాలు కూడా 600à°•à°¿ చేరువయ్యాయి. చిత్తూరు జిల్లాలో మరో 412 మంది వైరస్‌ బారినపడగా.. బాధితుల సంఖ్య 75వేల మార్కు దాటేసింది. కరోనాతో ఇప్పటి వరకు 754 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో కొత్తగా 370 మందికి కరోనా వైరస్‌ సోకింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. గుంటూరు జిల్లాలో 385 మందికి వైరస్‌ సోకగా.. కర్నూలు జిల్లాలో మరో 66 కేసులు బయటపడ్డాయి. à°•à°¡à°ª జిల్లాలో 212 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటి వరకు 492 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురంలో 196 మంది కరోనా బారినపడగా.. నెల్లూరులో 126 మందికి పాజిటివ్‌à°—à°¾ తేలింది. విశాఖ జిలాల్లో 171 కేసులు బయటపడగా.. శ్రీకాకుళం జిల్లాలో మరో 126 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో తాజాగా 122 మందికి వైరస్‌ సోకగా ఇప్పటి వరకు 195 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.