నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు

Published: Saturday October 24, 2020

రాష్ట్రంలోని పాఠశాలలు నవంబరు 2 నుంచి తెరుచుకోనున్నాయి. à°ˆ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌à°Ÿà±€) కసరత్తు చేస్తోంది. కొవిడ్‌ కారణంగా బడులు తెరవడం ఇప్పటికే దాదాపు నాలుగున్నర నెలలు ఆలస్యమైంది. అయినా విద్యార్థులు నష్టపోకుండా, జీరో ఇయర్‌ లేకుండా ప్ర త్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది.

 

వచ్చేనెల 2 నుంచి ఏప్రిల్‌ 30వరకు పాఠశాలలు నిర్వహించడం ద్వారా à°ˆ విద్యా సంవత్సరంలో 140 పనిదినాలు మాత్రమే వస్తాయని అధికారులు తేల్చారు. దీనికోసం సం క్రాంతి, క్రిస్మస్‌ సెలవులను గణనీయంగా తగ్గించనున్నారు. గతంలో 10 రోజులున్న వీటిని 3 రోజులకు తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ దీనిపై పునరాలోచన చేస్తే 5 రోజుల వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి రెండో శనివారాలను కూడా పనిదినాలుగా మారుస్తున్నారు.

 

ఇక, 1- 9à°µ తరగతి వరకు సిలబ్‌సను తగ్గించకుండా కొన్ని పాఠాలను కుదించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరగతిలో ఉపాధ్యాయుడు బోధించాల్సిన పాఠాలు, విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా, సొంతంగా నేర్చుకునే పాఠాలుగా మొత్తం సిలబ్‌సను విభజిస్తారు. గతంలో ఏటా 2 సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌సఏ), 4 ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌ఫఏ) పరీక్షలను నిర్వహించేవారు.

 

కానీ à°ˆ సంవత్సరం à°’à°• సమ్మేటివ్‌, 2 ఫార్మేటివ్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో ఎఫ్‌ఏ-1, మార్చిలో ఎఫ్‌ఏ-2, ఏప్రిల్‌లో ఎస్‌ఏ పరీక్షను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇక పదో తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్‌గానే తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈసారి టెన్త్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3/4 వారంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.