మెడికల్‌ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం భూములను కేటాయింపు

Published: Thursday November 05, 2020

మెడికల్‌ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం భూములను కేటాయించింది. మచిలీపట్నం చిలకలపూడిలో మెడికల్‌ కాలేజీకి 29.6 ఎకరాలు, విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీకి 80 ఎకరాలు, విశాఖ జిల్లా తలారిసింగి వద్ద మెడికల్ కాలేజీకి 35 ఎకరాల కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అనంతపురం జిల్లా పెనుగొండలో మెడికల్‌ కాలేజీకి 48.49 ఎకరాలు, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సమీపంలో 12.5 ఎకరాలు, కాకినాడలో మెడికల్‌ కాలేజీ కోసం విలువైన 17.76 ఎకరాలను కేటాయించారు. వీటిలో పాటుగా విశాఖ జిల్లా అనకాపల్లిలో మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాలు, గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని జమ్మలపాలెంలో 51.07 ఎకరాలు, గుంటూరు జనరల్ ఆస్పత్రి విస్తరణ కోసం 6 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్ కాలేజీలకు భూముల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మెడికల్ కాలేజీలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.