రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Published: Saturday November 07, 2020

రాష్ట్రంలో రూ.700 కోట్లతో ఎలక్ర్టానిక్‌ విడిభాగాల తయారీ కర్మాగారం నెలకొల్పేందుకు తైవాన్‌కు చెందిన పీఎ్‌సఏ వాల్సిన్‌ సుముఖత వ్యక్తం చేసింది. కొప్పర్తి ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌లో లేదా తిరుపతి సమీపంలోని ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌-2లో కానీ à°ˆ కంపెనీ ప్లాంటు పెట్టనుంది. తైవాన్‌కు చెందిన ఆర్థిక, సాంస్కృతిక కమిటీ డైరెక్టర్‌ బెన్‌ వాంగ్‌, తైవాన్‌కు చెందిన ఫోక్స్‌ లింక్‌, అపాచ్‌, పీఎ్‌సఏ వాల్సిన్‌, గ్రీన్‌టెక్‌ కంపెనీల ప్రతినిధులు శుక్రవారం ఏపీఐఐసీ భవనంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం, సీఎం జగన్‌తోనూ à°ˆ బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. మేకపాటి, వాంగ్‌లు మీడియాతో మాట్లాడారు. సెమీకండక్టర్స్‌ రంగంలో తైవాన్‌ ముందుందని, అందుకే కొప్పర్తి ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌లో సెమీకండక్టర్‌ పరిశ్రమ పెట్టాలని కోరినట్టు గౌతమ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి కొప్పర్తి సెజ్‌కు సోమశిల నుంచి 0.6 టీఎంసీల నీటిని కేటాయించామని, సెమీకండక్టర్స్‌ పరిశ్రమ వస్తే మరింత నీటిని కేటాయిస్తామని హామీ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఐటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు తైవాన్‌ బృందం ఆసక్తి చూపిందన్నారు. రిజర్వాయర్లలోని నీటిలో పరిశ్రమల కోసం కొంతకేటాయిస్తున్నామన్నారు. నిరంతర విద్యుత్‌, వివాదాల్లేని 48,352 ఎకరాల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉందన్నారు. మరోవైపు మహారాష్ట్రతో పోలిస్తే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఖర్చు తక్కువ అవుతుందని అధికారులు తైవాన్‌ బృందానికి వివరించారు. 

తాజా ఎస్‌ఐపీబీ సమావేశంలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌, మరికొన్ని పెట్టుబడులకు ఆమోదం తెలిపామని మేకపాటి పేర్కొన్నారు. వచ్చే ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్టు చెప్పారు.