అధికార పార్టీలకు బ్రేకులేస్తాం దేశం నలుదిక్కులా మోదీ హవా

Published: Wednesday November 11, 2020

రాబోయే మూడేళ్లలో తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ రాజకీయ టపాసులు పేలుస్తుందని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాజకీయ ఫైర్‌ వర్క్సు ఎలా ఉంటాయో దక్షిణాది రాష్ర్టాల్లో ప్రధానంగా తెలుగు రాష్ర్టాల్లో చూడొచ్చని వ్యాఖ్యానించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సహా ఇతర రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు సమీప భవిష్యత్‌లో బీజేపీ బ్రేక్‌ వేస్తుందని జీవీఎల్‌ చెప్పారు. ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాది రాష్ర్టాల్లో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాభవం బాగా పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో దబ్బాక ఉప పోరులో బీజెపీ ఘనవిజయం సాధించడమే దీనికి నాందిగా పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్జేడీ కూటమికి మంచి మద్దతుందని అందరూ అంచనా వేసినా, à°—à°¤ 15 ఏళ్లుగా బీజేపీని గమనిస్తున్న ప్రజలు ఇప్పుడు బీజేపీకి పట్టం కట్టారన్నారు.

 

తొలి నుంచి తాము చెబుతున్నట్లు జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌తోనే తమ పొత్తు ఉంటుందని జీవీఎల్‌ చెప్పారు. à°—à°¤ ఆరు నెలలుగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ నరేంద్రమోదీ నాయకత్వంపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారనడానికి à°ˆ ఫలితాలే ఉదాహరణని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో ఉప ఎన్నికలు జరిగిన కర్ణాటక, జార్ఖండ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో గతంలో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పారు.