భారత వైమాని దళం, నావికా దళం చేసిన కృషి ప్రశంసనీయo

Published: Saturday November 14, 2020

కరోనా కారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకురావడంలో భారత వైమాని దళం, నావికా దళం చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేవలం శత్రువులతో పోరాడే సామర్థ్యాన్నే కలిగి ఉండటం కాకుండా, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడంలోనూ సాయుధ దళాలు ముందున్నాయని ఆయన ప్రశంసించారు. ‘‘కరోనా సమయంలో భద్రతా బలగాలు యుద్ధ ప్రాతిపదికన సేవలందించాయి. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, మెడికల్ తదితర వస్తువులను అందించడంలో చాలా సమర్థవంతంగా సేవలందించాయి.’’ అని మోదీ ప్రశంసించారు. భారత్ పెద్ద పెద్ద దేశాలతో సైనిక విన్యాసాలు కూడా చేస్తోంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించే దేశాలతోనూ కలిసి పనిచేస్తున్నాం. ప్రపంచంలో ఉగ్రవాద స్థావరాలు ఏ మూలన ఉన్నా... లేపేసే సత్తా భారత ఆర్మీకి ఉంది.’’ అని మోదీ ప్రశంసించారు. భారత భూభాగంపై ఎవరు కన్నేసినా... వారికి దీటైన సమాధానం చెప్పే సత్తా కూడా భారత ఆర్మీకి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.