ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ కీలక నిర్ణయం

Published: Wednesday November 18, 2020

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 25à°¨ నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కార్యక్రమం నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎం జగన్ స్పష్టం చేశారు. à°¡à°¿-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌ 25నే ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టాలని భావిస్తోంది. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ అధికార యంత్రాగానికి ఆదేశాలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 30,68,281 మంది లబ్ధిదారులను గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయ స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వవద్దని ఏపీ సర్కార్‌కు ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.