కూటికి నోచని రైతులు... రాత్రికి రాత్రే కోటీశ్వరులు

Published: Wednesday May 30, 2018

‘తంతే బూరెల బుట్టలో పడటం’ అనే సామెత ఒక్కోసారి నిజమనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన రైతులను అదృష్టదేవత ఉన్నట్టుండి వరించింది. హద్‌గావ్‌కు పరిధిలోని 242 మంది రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. వివరాల్లోకి వెళితే తుల్జాపూర్, నాగ్‌పూర్ నేషనల్ హైవే సమీపంలో ఉన్న హద్‌గావ్ తహశీల్ పరిధిలో 8 గ్రామాలున్నాయి. రహదారి నిర్మాణం కోసం వీరిద్దగ్గరి నుంచి ప్రభుత్వం 5,44,517 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతిగా వారికి కోట్లాది రూపాయల నష్టపరిహారం చెల్లించనుంది. నిజానికి à°ˆ గ్రామాల్లో నీటి చుక్క లభించడం కూడా గగనమే! దీనికి తోడు పంటలు కూడా సరిగా పండిన దాఖలాలే లేవు. దీంతో ఇక్కడి రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల ప్రభుత్వం ఆయా గ్రామాల్లోని రైతుల భూములను స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతిగా వారికి 78 కోట్ల 157 లక్షల 590 రూపాయలను నష్టపరిహారంగా చెల్లించనుంది. ఒక్కసారిగా ఇంత భారీమొత్తంలో సొమ్ము లభించడంతో ఇక్కడి రైతులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.