ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తీవ్ర స్థాయిలో సైబర్ నేరాలు

Published: Monday December 07, 2020

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు అత్యంత తీవ్ర స్థాయిలో పెరగుతున్నాయని మెకాఫీ అనే సంస్థ సోమవారం వెల్లడించింది. 2019 ఏడాదిలో ఒక బిలియన్ డాలర్ల (₹73.86 లక్షల కోట్లు) కంటే విలువైన సంపద సైబర్ నేరాల్లో పోయినట్లు మెకాఫీ సర్వే తెలిపింది. సైబర్ నేరాల్లో కోల్పియిన ఈ సంపద ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఒక శాతం ఉంటుదట. కాగా, 2018 నాటి సైబర్ నేరాలతో పోలిస్తే 2019 ఏడాదిలో జరిగిన సైబర్ నేరాల రేటు 50 శాతం ఎక్కువని మెకాఫీ తెలిపింది.

 

సైబర్ నేరాలు ఎక్కువగా ఐపీ దింగిలించడం ద్వారానే జరుగుతున్నాయట. సుమారు 75 శాతం సైబర్ నేరాలకు ఇదే ప్రధాన కారణమని, ఎక్కువ కంపెనీలు ఎదుర్కొనే సమస్య కూడా ఇదేనని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సిఎస్ఐఎస్) భాగస్వామ్యంతో నిర్వహించిన నివేదికలో మెకాఫీ పేర్కొంది. 'ది హిడెన్ హిడెన్ కాస్ట్స్  సైబర్ క్రైమ్' అనే పేరుతో à°ˆ నివేదికను విడుదల చేశారు. à°ˆ నివేదకలో కంపెనీలకు జరిగిన నష్టాన్ని విశ్లేషించారు. 92 శాతం వ్యాపారాల్లో ఆర్థిక వ్యయాలకు మించి వ్యాపారంపై ఇతర ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని భావించాయని, సైబర్ దాడుల తర్వాత ఆయా కంపెనీ పెద్ద మొత్తంలో పని గంటలు కోల్పోయాయని తెలిపారు.

 

కంపెనీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సైబర్ దాడుల సంఖ్య పెరుగుతూనే ఉందని, ఓ వైపు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నప్పటికీ అదే పెను విపత్తుగా మారుతోందని తెలిపారు. అయితే ఈ సైబర్ దాడుల నిరోధానికి 951 యాజామాన్యాల వద్ద తగిన జాగ్రత్తలు ఉన్నాయని చెప్పినప్పటికీ కేవలం 32 శాతం యాజమాన్యాలు మాత్రమే వీటి పట్ల సంతృప్తిగా ఉన్నాయట. ఇక ఇప్పటి వరకు ఆయన యాజమాన్యాలు కోల్పోయిన మొత్తం సంపదలో సగటున 762,231 డాలర్లు (₹5.6 కోట్లు) ఉంటుందట