మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి... మృతి

Published: Thursday May 31, 2018

 à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ పుండలిక్ ఫండ్కర్ బుధవారం అర్ధరాత్రి తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

పాండురంగ పుండలిక్ ఫండ్కర్ అలియాస్ భౌసాహేబ్ ఫండ్కర్ గతంలో శాసనమండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గం నుంచి 9, 10, 11 లోకసభలకు ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పాండురంగ పనిచేశారు. ఆయన 1950లో బుల్ధానాలో జన్మించారు.

1980, 1978లలో ఖాంగావ్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు పాండురంగ పుండలిక్ ఫండ్కర్. జులై 8, 2016లో ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఆయన అకోల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పాండురంగ మృతితో ఆ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. అదేవిధంగా కర్ణాటకలో మూడు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరగనున్నాయి.