మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ

Published: Wednesday December 09, 2020

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం అశోక్ గెహ్లాట్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 21 జిల్లాల్లో జరిగిన పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. 4,371 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే... 1,835 పంచాయతీ సీట్లలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ 1,718 సీట్లను సాధించుకుంది. అలాగే 636 జిల్లా పరిషత్ సీట్లలో ప్రతిపక్ష బీజేపీ 266 స్థానాలను కైవసం చేసుకోగా, అధికార పక్షమైన కాంగ్రెస్ 204 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారు. అయితే టోంక్ పంచాయతీ సమితి పరిధిలో ముగ్గురు స్వతంత్రులు గెలుపొందడం విశేషం. తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని à°† ముగ్గురు స్వతంత్రులు ప్రకటించారు. à°ˆ టోంక్ పంచాయతీ సమితి పరిధిలో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 19 సీట్లకు గాను బీజేపీ 9, కాంగ్రెస్ 7, స్వతంత్రులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. 

పేదలకు, రైతులకు మోదీపై నమ్మకముందని రుజువైంది : నడ్డా ట్వీట్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ‘‘స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మహిళలు రైతులు, గ్రామీణులు బీజేపీపై విశ్వాసం ప్రకటించారు. ప్రధాని మోదీపై కూడా విశ్వాసం ప్రకటించారు. వారందరికీ ధన్యవాదాలు. గ్రామీణులు, పేదలు, రైతులు, ప్రధానిపై విశ్వాసం ప్రకటించారన్న సంకేతాలు à°ˆ ఫలితాల ద్వారా వెలువడ్డాయి.’’ అని జేపీ నడ్డా ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.