గురుద్వారాను సందర్శించిన మోదీ

Published: Sunday December 20, 2020

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం ఢిల్లీలోని గురుద్వారా రకాబగంజ్ చేరుకుని, గురు తేగ్‌బహదూర్‌కు నివాళులు అర్పించారు. ప్రధాని గురుద్వారా సందర్శన కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నిర్ణయించుకున్నారు. ప్రధాని గురుద్వారా వరకూ చేరుకునే సమయంలో ఆయనకు ప్రత్యేక పోలీసు బందోబస్తు లేదు. అలాగే à°ˆ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయలేదు. à°ˆ రోజు ఉదయాన్నే మంచుకురుస్తుండగా, à°’à°• సామాన్య వ్యక్తి మాదిరిగా ప్రధాని మోదీ గురుద్వారా చేరుకున్నారు. 

 

 

తరువాత ప్రధాని తన గురుద్వారా సందర్శనకు సంబంధించిన ఫొటో షేర్ చేశారు. దీనితోపాటు గురుముఖి భాషలో సందేశమిచ్చారు. తాను à°ˆ రోజు చారిత్రాత్మక గురుద్వారా రకాబగంజ్ సాహిబ్‌కు ప్రార్థనలు చేశానని. అక్కడ గురు తేగ్‌బహదుర్ పవిత్ర శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారని తెలిపారు. గురు తేగ్‌బహదూర్ à°ˆ ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితులను చేసి, ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లించారన్నారు. గురు సాహిబ్ విశేష కృపతోనే తమ ప్రభుత్వ పాలనా కాలంలో గురు తేగ్‌బహదూర్ 400à°µ ప్రకాశ్ పర్వాన్ని జరుపుకుంటున్నామన్నారు. à°ˆ సందర్భంగా తేగ్ బహదూర్ ఆదేశాలను గుర్తు చేసుకుంటున్నామన్నారు. కాగా ఢిల్లీలో గురుద్వారా రకాబగంజ్ 1783à°µ సంవత్సరంలో నిర్మితమైంది.