కొత్త కరోనాకు టీకా!

Published: Tuesday December 22, 2020

కొత్త కరోనా రూపంలో ప్రమాదం ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థ à°“ శుభవార్త చెప్పింది. ఫైజర్‌తో కలసి తాము సంయుక్తంగా రూపొందించిన టీకా కొత్త కరోనాకూ చెక్ పెట్టగలదని భరోసా ఇస్తూనే.. అవసరమైతే కొత్త వైరస్ కోసం ప్రత్యేక టీకాను కూడా డిజైన్ చేయగలమని తెలిపింది. కేవలం ఆరు వారాల్లోనే à°ˆ నయా స్ట్రెయిన్‌కు చెక్ పెట్టేలా టీకాను అందుబాటులోకి తేగలమని ప్రకటించింది.

 

అయితే.. ప్రస్తుతమున్న టీకాతో కొత్త స్ట్రెయిన్‌ను నిలువరించే అవకాశాలు చాలా ఎక్కువని స్పష్టం చేసింది. à°ˆ మేరకు బయోఎన్‌టెక్ చీఫ్ ఉగుర్ సాహిన్ తెలిపారు. ‘శాస్త్రపరంగా చూస్తే..ప్రస్తుతమున్న టీకా కొత్త స్ట్రెయిన్‌ను అడ్డుకోగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే..ఎమ్ఆర్‌ఎన్ఏ టెక్నాలజీతో కొత్త కరోనాకు చెక్ పెట్టే టీకా డిజైనింగ్‌ను వెంటనే ప్రారంభించొచ్చు. à°ˆ సాంకేతికత విశిష్టత ఇదే. కేవలం ఆరు నెలల్లోనే టీకాను అందుబాటులోకి తేవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

ఇక టీకా వచ్చేస్తోందన్న సంబరంలో ఉన్న ప్రపంచాన్ని కొత్త కరోనా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో à°ˆ వైరస్ కళ్లు తెరిచిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో ప్రపంచ దేశాలు అలర్టైపోయాయి. యూరప్‌తో పాటూ అనేక దేశాలు బ్రిటన్‌కు విమానయాన సర్వీసులను నిలిపివేశాయి. భారత్‌కూ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. డిసెంబర్ 31 వరకూ విమానసర్వీసులను నిలిపివేసింది. అదే సమయంలో..బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల విషయంలో పాటించేందుకు ప్రమాణిక విధి విధానాలను విడుదల చేసింది.