కేంద్రం కన్నెర్రతో సర్కారులో కదలిక

Published: Monday December 28, 2020

చెత్త పనులపై చర్యలు మొదలయ్యాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ ప్రకాశరావుపై సస్పెన్షన్‌ వేటుపడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వడం లేదంటూ బ్యాంకుల ఎదుట చెత్తను డంపింగ్‌ చేయించిన వ్యవహారంలో ఆయనపై à°ˆ చర్య తీసుకొన్నారు. à°ˆ మేరకు ఆదివారం మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి విజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇదే వ్యవహారంలో విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ వి.ప్రసన్నవెంకటేశ్‌, మచిలీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణలకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. à°ˆ ఉత్తర్వుల్లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈనెల 24à°¨ కృష్ణా జిల్లాలోని 16 బ్యాంకుల ముందు చెత్తను వాహనాల్లో తీసుకొచ్చి డంపింగ్‌ చేశారు .వైఎస్‌ జగనన్న చేదోడు, పీఎం స్వానిధి పథకాలకు రుణాలు ఇవ్వనందుకే చెత్తను డంపింగ్‌ చేసినట్టు ఉయ్యూరులో ఏకంగా మున్సిపల్‌ కమిషనర్‌ పేరుతోనే బోర్డును బ్యాంకు గేటుకు వేలాడదీశారు. మచిలీపట్నంలో ట్రాక్టర్‌లో తెచ్చిన చెత్తను à°’à°• రోజంతా బ్యాంకు ముందే ఉంచారు. à°ˆ ఘటనలపై బ్యాంకు అధికారులు, ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెత్తపోసే ఫొటోలను ట్విట్టర్‌లో కేంద్ర ఆర్థిక శాఖకు, బ్యాంకుల ఉన్నతాధికారులకు ట్యాగ్‌ చేశారు. దీనిపై కేంద్రం సీరియ్‌సగా స్పందించింది. హుటాహుటిన à°ˆ ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇలా అన్ని వైపుల నుంచీ వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలను చల్లబరిచేందుకుగాను పురపాలక శాఖ శనివారం ఉన్నతాధికారులతో à°’à°• కమిటీని నియమించింది.

 

తొలుత ఉయ్యూరులో విచారణ నిర్వహించిన à°ˆ కమిటీ అక్కడి ఉదంతాలకు à°† నగర పంచాయతీ కమిషనర్‌ ఎన్‌.ప్రకాశరావును బాధ్యుడిగా గుర్తిస్తూ, పై అధికారులకు తన నివేదికను సమర్పించింది. à°ˆ నివేదికతోపాటు ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలను కూడా పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకున్నట్లు ‘సస్పెన్షన్‌’ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడురోజుల సెలవు అనంతరం బ్యాంకులు సోమవారం పునఃప్రారంభమవుతాయి. బాధ్యులైన మున్సిపల్‌ అధికారులపై చర్యల ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ, బ్యాంకర్లు, ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని అప్పటికి కొంతైనా చల్లార్చాలనే తాజా ఉత్తర్వులను సెలవు రోజు అయినా ఆదివారమే వెలువరించినట్టు భావిస్తున్నారు.