3 నెలల్లో 4 వేల ఇళ్లు కడతారా?

Published: Thursday December 31, 2020

 à°µà°šà±à°šà±‡ డిసెంబరునాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్నారని.. కానీ ఇప్పటి వరకూ భూసేకర à°£, సహాయ పునరావాస కార్యక్రమాలు కొలిక్కి రాలేద ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆక్షేపించింది. ‘41.15 మీటర్ల కాంటూరు వరకూ 17600 గృహాలను నిర్మించాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకూ 11, 000 గృహాలు నిర్మించామంటున్నారు. మరో 6,600 గృహాల్లో 2,600 చివరి దశలో ఉన్నాయంటున్నారు. ఇం కో 4,000 ఇళ్లను ఎప్పటికి నిర్మిస్తారో.. వాటి ప్రణాళికలు ఏమిటో వెల్లడించడం లేదు. సహాయ పునరావా à°¸ కమిషనర్‌ను ఎన్నిసార్లు అడిగినా వివరాలివ్వడం లేదు. à°ˆ సమాచారం ఎందుకివ్వడం లేదు’ అని పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ రాష్ట్ర జలవనరుల శాఖను ప్రశ్నించారు. మార్చి నాటికి సహాయ పునరావాసం, గృహ నిర్మాణ పనులు ఎలా చేస్తారో వివరించ à°¡à°‚ లేదని.. మూడు నెలల్లో 4 వేల ఇళ్లను నిర్మిస్తార న్న నమ్మకం కలగడం లేదని.. దానిపై స్పష్టత ఇవ్వాల ని అన్నారు. వచ్చే డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యం నేపథ్యంలో జల వనరుల శాఖతో పీపీఏ సీఈవో బుధవారం విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీపీఏ అధికారులు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొన్నారు.

ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాసం, చె ల్లింపులు నిర్వహిస్తే తప్ప.. కాఫర్‌ డ్యాం మూతకు అనుమతులు ఇవ్వబోమని అయ్యర్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 45.72 మీటర్ల à°Ž త్తున 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సిందేనని.. అందుకు అనుగుణంగానే పూర్తి కాంటూరులోని చివరి నిర్వాసితుడి వరకూ భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. à°ˆ కార్యకలాపాలు వచ్చే డిసెంబరు నాటికి పూర్తవుతాయా అని సందేహమూ వ్యక్తం చేశారు. ‘45.72 మీటర్ల కాంటూరుకు 1,67,339.33 ఎకరాలను సేకరించాల్సి ఉంటే.. ఇప్పటి వరకూ 1,11,184.83 ఎకరాలే సేకరించారు. 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతాయని.. అందులో 3,110 కుటుంబాలకు మాత్రమే సహా à°¯ పునరావాసం అందిందని జల వనరుల శాఖ చె ప్పింది. మిగిలిన 1,02,491 కుటుంబాలకు ఎప్పటిలోగా అందిస్తారు? డిసెంబరులోగా పరిహారం చెల్లింపు à°¸ హా.. పునరావాసం కల్పించగలరా? ఇందుకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయా? భూసేకరణ, సహాయ పునరావాసానికి ఇంకా రూ.26,585 కోట్లు కావాలి.  అందుకు తగిన నిధుల సమీకరణ కార్యారరణ ఏదీ? కేంద్రం అంచనా వ్యయాన్ని సవరిస్తే తప్ప.. వాటిని ఎలా వ్యయం చేస్తారు’ అని నిలదీశారు. పూర్తి సామర్థ్యం మేరకు 45.72 మీటర్ల ఎత్తున నీటిని నిల్వ చేసేలా సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.