నాగాలాండ్-మణిపూర్ సరిహద్దులో కార్చిచ్చు

Published: Friday January 01, 2021

 à°¨à°¾à°—ాలాండ్-మణిపూర్ సరిహద్దులో కార్చిచ్చు చెలరేగింది. డిజుకు లోయ ప్రాంతంలోని చాలా భాగంలో అడవి తగలబడిపోతోంది. à°—à°¤ కొన్ని రోజులుగా ఎగసిపడుతున్న మంటలు క్రమంగా మౌంట్ ఐజో దిశగా మణిపూర్ వైపు విస్తరిస్తున్నాయి. దావానలాన్ని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) సాయాన్ని అర్థించింది. అలాగే, ఆర్మీ, పారామిలటరీ బలగాల సాయాన్ని కూడా కోరినట్టు అధికారులు తెలిపారు.

 

మంటలు నాగాలాండ్ వైపు నుంచి ప్రారంభమై ఉండొచ్చని సేనాపతి జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) తెలిపారు. డిసెంబరు 28 నుంచే మంటలు చెలరేగినట్టు నాగలాండ్ సరిహద్దు ప్రజలు చెబుతున్నారు. గురువారం ఉదయానికి ఇవి మణిపూర్ సరిహద్దుకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

 

 

మణిపూర్ వైపు విస్తరిస్తున్న మంటలను అదుపు చేసేందుకు 130 గ్రామస్థులతో కూడిన బృందాన్ని అటవీశాఖ అధికారులు పంపించారు. అయితే, గాలులు అధిక వేగంతో వీస్తుండడం, అక్కడి భూభాగం నిటారుగా ఉండడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. సరిహద్దుకు చేరుకోవాలంటే à°ˆ బృందం నిటారుగా 14 కిలోమీటర్లు పాటు ఎక్కాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిని కావాలని చేసిన పనిగా అనుమానిస్తున్నామని, నిందితులపై à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని మణిపూర్ మావో కౌన్సిల్ హెచ్చరించింది. 

 

 à°šà±€à°«à± సెక్రటరీ డాక్టర్ రాజేశ్ కుమార్, డీజీపీ ఎల్ఎం ఖౌటే, సేనాపతి డీసీ టీహెచ్ కిరణ్ కుమార్‌లతో కలిసి మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ డిజుకో లోయలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు మొదలైన ఏరియల్ సర్వే మధ్యాహ్నం 1.30 à°—à°‚à°Ÿà°² వరకు కొనసాగింది. కాగా, దావానలాన్ని అదుపు చేసేందుకు 200 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు