మీ దగ్గర సెక్షన్‌ 30 ఉంటే.. కేంద్రం దగ్గర 356 ఉంది

Published: Wednesday January 06, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ సెక్షన్‌ 30 అమలు చేస్తే.. కేంద్రం చేతిలో 356 అస్త్రం ఉందని మరిచిపోకూడదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ కేంద్రం గమనిస్తోందని, ఆట మొదలైందని వ్యాఖ్యానించారు. విశాఖలో మంగళవారం మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్‌ 30 అమలులో ఉందని తమను పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. రాష్ట్రంలో విజయవాడ ఘటనతో కలుపుకొని మొత్తం 126 ఆలయాలపై దాడులు జరిగితే ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని కామినేని ఆక్షేపించారు. కాగా, ఆలయాలపై దాడులకు బాధ్యత వహిస్తూ దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, హోంమంత్రి సుచరిత రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌నాయుడు డిమాండ్‌ చేశారు. ఒంగోలులో ర్యాలీ నిర్వహించి వెలంపల్లి దిష్టిబొమ్మ దహనం చేశారు. 

‘సీఎం రమేశ్‌ బీజేపీ అని మీరు భావిస్తున్నారా? మేమలా అనుకోవడం లేదు. ఆయన పక్కా తెలుగుదేశం పార్టీవాది. ఆయన మాట్లాడే మాటలకు విలువ ఉందా?’ అని మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖలో ప్రశ్నించారు. 

దేవాలయాలపై జరుగుతున్న దాడులు ప్రభుత్వ,పోలీస్‌ వైఫల్యమేనని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరంలో రామకృష్ణ, విజయవాడలో పి.మధు మాట్లాడుతూ రామతీర్థంపై సిట్‌ విచారణకు ఆదేశించాలన్నారు.