కోవిడ్-19పై పోరాటంలో మరో చారిత్రక ముందడుగు

Published: Saturday January 09, 2021

భారతదేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌à°—à°¾ పేర్కొంటున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈనెల 16à°¨ ప్రారంభమవుతోంది. తొలి ప్రాధాన్యతా క్రమంగా సుమారు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం శనివారంనాడు ప్రకటించింది. కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం à°ˆ నిర్ణయం ప్రకటించింది.

 

 

పండుగ సీజన్ కావడం, సంక్రాతి, పొంగల్, మాఘ్ బిహు తదితర పండుగలను కూడా పరిగణనలోకి తీసుకుని జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించాలని మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం à°’à°• ప్రకటనలో పేర్కొంది. తొలి ప్రాధాన్యతా క్రమంగా హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సనేషన్ ఇస్తామని, à°† తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం à°’à°•à°Ÿà°¿ లేదా అంతకు పైబడి వ్యాధులున్న 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది.

 

జనవరి 16à°¨ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడం ద్వారా కోవిడ్-19పై భారతదేశం మరో చారిత్రక ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ à°“ ట్వీట్‌లో పేర్కొన్నారు. కోవిడ్-19‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న మన సాహసులైన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, సఫాయి కార్మికులకు తొలి ప్రాధాన్యతా క్రమంగా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.