కర్నూలుకు హైకోర్టుపై..రీనోటిఫికేషన్‌

Published: Wednesday January 20, 2021

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా.. కర్నూలులో హైకోర్టును నెలకొల్పేలా రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌తో కలిసి షాను ఆయన కలిశారు. గంటకుపైగా సమావేశం కొనసాగింది. ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని సీఎం ప్రస్తావించారని ముఖ్యమంత్రి కార్యాలయం à°“ అధికార ప్రకటనలో తెలిపింది. దాని ప్రకారం.. ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్యనిర్వాహక పరిపాలనా రాజధానిగా విశాఖను, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. ఇందుకోసం వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020ని తీసుకొచ్చామని జగన్‌ కేంద్ర హోం మంత్రికి చెప్పారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన విషయాన్నీ గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లకు ఆమోదించాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖకు సూచించాలని కోరారు. 2018 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రావాల్సిన రూ.1,644.23 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని షాకు జగన్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి హోదా చాలా అవసరమని, కొత్త పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అలాగే, 2014-15 నాటికి గాను రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లు అని, కేంద్రం మాత్రం రూ.4,117.89 కోట్లుగా గుర్తించిందని, అందులోనూ 3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించారు. మిగిలిన మొత్తం రూ. 18,83087 కోట్లు విడుదల చేయాలని కోరారు. విజయనగరంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి రాష్ట్రపతి ఆమో దం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని, రానున్న 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. రాష్ట్రంలో డిస్కం సంస్థల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తగిన సాయం అందించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈరంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు, సంస్కరణలకు కేంద్రం సహాయ, సహకారాలు అందించాలన్నారు. కుడిగి, వల్లూరు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లతో డిస్కంలు 2040 వరకు ఒప్పందాలు చేసుకున్నాయని, ఇతర ప్లాంట్లతో పోల్చితే à°ˆ ప్లాంట్ల రేట్లు అధికంగా ఉన్నాయని, ఇంత రేట్లు చెల్లించే పరిస్థితిలో ఏపీ విద్యుత్‌ సంస్థలు లేవని.. కాబట్టి à°ˆ రెండు ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను సరెండర్‌ చేయడానికి అంగీకరించాలని కోరారు. 

 

ఎగువ సీలేరులో చేపడుతున్న 1,350 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుకు రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని.. దీనికి కేంద్రం ఆర్థిక సాయం చేయడంతో పాటు అటవీ, పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,282 కోట్లను కేంద్రం విడుదల చేయాలని సీఎం కోరారు. ఉపాధి హామీ పథకం à°•à°¿à°‚à°¦ పనిదినాలను 100 నుంచి 150à°•à°¿ పెంచాలని, à°ˆ పథకం à°•à°¿à°‚à°¦ పెం డింగ్‌లో ఉన్న 3707.77 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నివర్‌ తుఫాను వల్ల జరిగిన నష్టానికి గాను తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం రూ.2,255.7 కోట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చిందని, à°† మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నిజానికి రాత్రి 10.30 గంటలకు అమిత్‌ à°·à°¾ సీఎం జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ హోం మంత్రి కార్యాలయం à°† సమయాన్ని à°—à°‚à°Ÿ ముందుకు జరిపింది.