ముఖ్యమంత్రి సహా మంత్రులంతా విశాఖకు వచ్చేస్తున్నారా?

Published: Friday January 22, 2021

ఏపీ రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా ఓవైపు ఉద్యమాలు కొనసాగుతుండగానే..మరోవైపు జగన్‌ సర్కార్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్న విషయంపై హాట్‌హాట్‌à°—à°¾ చర్చ సాగుతోంది. విశాఖలో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్న వార్తలు పొలిటికల్‌ సర్కిల్‌లో దుమారం రేపుతున్నాయి. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును సవాలు చేస్తూ రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై  హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తుది తీర్పు వచ్చేవరకు కార్యలయాలు తరలింపునకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం స్టేటస్‌కో ఉత్తర్వులు ఇచ్చింది.

 

అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం లేకపోతే à°ˆ పాటికే ముఖ్యమంత్రి, మంత్రులు వైజాగ్‌ నుంచే పాలన సాగించేవారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య తగ్గడం, వ్యాక్సిన్ పంపిణీకి సిద్దం కావడంతో...అధికార పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయట. ఇక కొందరు మంత్రులైతే మార్చి నెల నుంచే విశాఖ నుంచి పాలన అంటూ తమ స్నేహితులు, అనుచరులకు లీకులు ఇస్తున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన à°“ మంత్రితో విలేఖరులు చిట్‌చాట్ చేయడానికి ప్రయత్నించగా..ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారని చెబుతున్నారు. తనకు వేరే కార్యక్రమానికి వెళ్లడానికి టైమ్ అవుతోందనీ..ఎలాగూ మార్చి నుంచి మనమంతా ఇక్కడే ఉంటామని చెప్పకనే చెప్పేశారట. దీంతో ప్రభుత్వ అంతరంగం ఏంటో అర్ధం అయిపోయిందని à°† విలేకరులు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

 

ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు విశాఖకు తరలించడానికి చాలా వ్యూహాత్మంగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు వ్యవహారంపై కోర్టుల్లో కేసులు నడుస్తుండటంతో..  వాటి జోలికి వెళ్లడకుండా సీఎం క్యాంప్‌ కార్యాలయంపై దృష్టి సారించినట్లు టాక్‌ వినిపిస్తోంది. న్యాయ వివాదాలు షరిష్కారమయ్యాక సచివాలయం, ఇతర కార్యాలయాలు తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా ఉండొచ్చుననీ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారట. విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నట్లు ఆఫ్ ది రికార్డులో వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని కూడా సెలవిస్తున్నారట. ముఖ్యమంత్రి సమీక్షలు, ఉపసంఘం భేటీలు, కేబినేట్ సమావేశాలు మార్చి నుంచి వైజాగ్‌లో జరుగుతాయని అంటున్నారు. తద్వారా విశాఖ నుంచే ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు ప్రజలకు సంకేతం ఇచ్చినట్లు అవుతుందని à°† పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.