ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Published: Monday January 25, 2021

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. à°°à°¾à°œà±à°¯à°¾à°‚à°— విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని పేర్కొంది. à°•à°°à±‹à°¨à°¾ ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్‌ ప్రశ్నించారు. 

 

సుప్రీం కోర్టులో మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ పిటిషన్‌కు ముందే ఎస్ఈసీ కేవియట్‌ దాఖలు చేసింది. విచారణలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.