ఆందోళనను విరమించిన రెండు రైతు సంఘాలు

Published: Wednesday January 27, 2021

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ), భారతీయ కిసాన్ యూనియన్ (భాను) అసంతృప్తి వ్యక్తం చేశాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న రైతు ఆందోళనల నుంచి తాము వైదొలుగుతున్నట్టు à°† రెండు యూనియన్లు బుధవారంనాడు ప్రకటించాయి. ఎవరికి తోచిన డైరెక్షన్‌లో వారు వెళ్లాలనుకునే వారితో కలిసి తాము ముందుకు వెళ్లాలనుకోవడం లేదని, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ మాత్రం తక్షణం ఆందోళన నుంచి విరమించుకుంటోందని ఏఐకేఎస్‌సీసీ నేత వీఎం సింగ్ తెలిపారు. బుధవారం జరిగిన హింసకు రాకేష్ తికాయిత్‌ను ఆయన తప్పుపట్టాయి. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో యోగేంద్ర యాదవ్, ఇతర రైతు నేతలతో పాటు రాకేష్ తికాయిత్ కూడా ఉన్నారు.