మదనపల్లె మర్డర్స్ కేసు.. కొత్త సందేహాలు

Published: Sunday January 31, 2021

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ‘మదనపల్లె డబుల్ మర్డర్స్’ à°µà±à°¯à°µà°¹à°¾à°°à°‚ అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. రోజుకో షాకింగ్, ఆసక్తికర విషయం వెలుగుచూస్తోందే తప్ప అసలు విషయం మాత్రం బయటికి రావట్లేదు. జంట హత్య కేసులు జరిగి వారం రోజులు గడుస్తున్నా మిస్టరీ à°µà±€à°¡à°Ÿà°‚ లేదు. హత్యలు ఎలా జరిగాయి..? అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. à°ˆ క్రమంలో సోషల్ మీడియాలో రోజురోజుకు à°ˆ హత్యకు సంబంధించి రకరకాలుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో ఏది నిజం.. ఏది అబద్దం..? అనేది తెలియట్లేదు. ప్రస్తుతం పద్మజ కుటుంబ సభ్యుల సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పెద్దమ్మాయి అలేఖ్యకు ఆధ్యాత్మిక భావాలున్నాయని ధ్యానం చేసుకుని ఒకరిద్దరు బాబాల బోధనల ప్రభావం ఆమెపై ఉన్నట్లు ఖాకీలు గుర్తించారు. అయితే.. అలేఖ్యకు మూఢ భక్తి లేదని ఆమె స్నేహితులుగా చెబుతున్న వారు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపడం మరో కొత్త అంశం.

 

ఇదిలా ఉంటే.. అలేఖ్య సోషల్ మీడియా ఖాతా ప్రొఫైల్ నేమ్, సెట్టింగ్స్‌ను ఎవరో మార్చారంటూ కొత్త సందేహాలు వస్తున్నాయి. చిన్నమ్మాయి సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అలేఖ్య మార్చారని మరో వాదన తెరపైకి వచ్చింది. అలేఖ్య ఫేస్‌బుక్ ఖాతాలు మరో మతాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు కల్పించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ à°…కౌంట్ కూడా ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కు మారడం అది కూడా హత్యకు కొన్ని రోజులు ముందు జరగడం అనుమానాస్పదంగా అవుతోంది. ఇవన్నీ à°’à°• ఎత్తయితే.. తల్లి పద్మజ అలేఖ్య నాలుక కోసి తాను కాళికాదేవినంటూ తినేయడం కూడా  పెద్ద వివాదాస్పదంగానే మారింది. à°ˆ క్రమంలోనే అలేఖ్య నాలుక కొనభాగం కాసింత దెబ్బతిన్నట్లు పోస్టుమార్టంలో వైద్యులు గుర్తించడంతో నిన్న, మొన్న పుకార్లు అక్షరాలా నిజమే అని తెలుస్తోంది. మున్ముందు ఇంకా ఎన్నెన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తాయో.

 

 

కాగా.. జంట హత్యల కేసు నిందితులు పురుషోత్తమ నాయుడు, పద్మజలను విశాఖ ఆస్పత్రికి తరలించనున్నారు. à°ˆ విషయమై ఎస్కార్ట్‌ కోరుతూ శనివారం నాడు చిత్తూరు ఏఆర్‌ పోలీసులకు నివేదిక పంపినట్లు మదనపల్లె స్పెషల్‌ సబ్‌జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణయాదవ్‌ చెప్పారు. వారు ఎస్కార్ట్‌ ఇస్తే ఒకట్రెండు రోజుల్లో నిందితులను విశాఖ ఆస్పత్రికి తరలించనున్నారు. రెండ్రోజుల ముందు అరుపులు, కేకలతో భయపెట్టిన పద్మజతో పాటు ఆమె భర్త ప్రస్తుతం జైల్లో సహచర ఖైదీలతో కలసిపోయి సాధారణ వ్యక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. పద్మజ, పురుషోత్తం మానసికంగా పూర్తిగా కోలుకుంటేనే జంట హత్యల కేసు చిక్కుముడి వీడనుంది.