దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా బడ్జెట్

Published: Monday February 01, 2021

దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా, దేశాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా బడ్జెట్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రజల బడ్జెట్ , పన్నుల భారం మోపకుండా ఈ బడ్జెట్ ఉంది. ఆర్ధిక వ్యవస్థకు ఊపునిచ్చే బడ్జెట్ అని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మౌలిక వసతులను మెరుగు పరిచే విధంగా బడ్జెట్ ఉందన్నారు. ఆరోగ్యరంగంపై ఖర్చును గణనీయంగా పెంచారు. ఆరోగ్యరంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు నిధులు కేటాయించారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు లక్షకోట్ల నిధులు కేటాయించారు. కొన్ని వస్తువులపై సెస్ విధించడం ద్వారా మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు పెంచనున్నారు. తాగునీటి సదుపాయం కోసం జలజీవన్ మిషన్ కోసం నిధులు కేటాయించారు.

 

ప్రపంచం అంతా ఆర్థికంగా నష్టపోయిన, దేశంలో ఆత్మనిర్భరతా నినాదంతో ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడ్జెట్‌ను రూపకల్పన చేశారని చెప్పారు. à°ˆ సందర్భంగా ఆర్ధిక మంత్రులకు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేయడం సహజం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను తెలుగు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదన్నారు. బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోతే నిధులు, మొండి చెయ్యి చూపినట్లు కాదు. పోలవరం గురించి రెండు రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ వస్తుంది. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు, బడ్జెట్ కేటాయింపుల గురించి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని జీవీఎల్ నరసింహారావు  తెలిపారు.