పాక్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన

Published: Wednesday February 03, 2021

హఠాత్తుగా దాయాది పాకిస్తాన్ మనస్సు మార్చుకుంది. నిత్యం భారత్‌పై కారాయాలు మిరియాలు నూరే పాక్... శాంతి వచనాలు వల్లించింది. ఇకపై.. తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, శాంతియుతంగా ఇరుదేశాలూ కలిసి సాగాలన్నదే తమ అభిమతమని పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా ప్రకటించారు. పాకిస్తాన్ వైమానికదళానికి చెందిన à°“ కార్యక్రమం రావల్పిండిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బాజ్వా హాజరయ్యారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని ప్రపంచ దేశాలకూ శాంతిహస్తాన్ని చాచాల్సిన సందర్భం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. అయితే దీన్ని పాక్ బలహీనతగా ఎవరూ భావించవద్దని, à°ˆ ప్రకటనకు పెడార్థాలు తీయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలూ శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని సూచించారు. ‘‘జమ్మూ కశ్మీర్ ప్రజల అభీష్టం మేరకు జమ్మూ కశ్మీర్ సమస్యను ఇరు దేశాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పరస్పర గౌరవానికే మేము అత్యధిక ప్రాధాన్యమిస్తాం. ఇదే ఆదర్శానికి మేమే కట్టబడి ఉంటాం. ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని చాటాల్సిన సందర్భమిది.’’ అని బాజ్వా ప్రకటించారు