మండే సూర్యునికే షాకిచ్చాడు!

Published: Tuesday June 05, 2018

చెట్లను యధేచ్ఛగా నరికివేయడంతోనే పర్యావరణానికి పెద్దఎత్తున హాని కలుగుతోంది. అయితే 15 ఏళ్లుగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న మధ్యప్రదేశ్‌లోని భిండ్‌కు చెందిన వీరేంద్ర తామ్రకార్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 75 ఏళ్ల వయసులోనూ అలుపన్నది లేక పర్యావరణం హితం కోరి పనిచేస్తున్నాడు. తన 15 ఏళ్ల కృషితో బంజరు భూమిగా కనిపించే ముక్తిధామాన్ని పచ్చని చెట్లతో నింపేశాడు. ఫలితంగా పట్టణంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే ముక్తిధామ్‌లో 4 డిగ్రీల సెల్సియస్‌కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న పట్టణంలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, పచ్చదనంతో నిండిన ముక్తిధామ్‌లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. à°—à°¤ 15 ఏళ్లలో వీరేంద్ర మక్తిధామ్‌లో మొత్తం 200 మొక్కలు నాటి, వాటి ని సంరక్షిస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ వీరేంద్ర ముక్తిధామ్ లో మొక్కలు నాటుతూనే ఉన్నాడు. ఇందుకోసం అయ్యేఖర్చును వీరేంద్ర తానే భరిస్తుంటాడు.