సీలేరు ప్రాజెక్టు సర్వే పరిశీలన

Published: Saturday February 13, 2021

 à°¸à±€à°²à±‡à°°à± ఎత్తిపోతల ప్రాజెక్టు సర్వే పనులను ముంబయికి చెందిన యాప్‌కాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు  చెందిన  బృందం శుక్రవారం అధ్యయనం చేసింది. సీలేరులో రూ.పది వేల కోట్లతో తొమ్మిది యూనిట్లతో 1,350 మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్రాజెక్టుకు డీపీఆర్‌ను  వ్యాప్‌కోస్‌ తయారు చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించడంతో త్వరలో à°ˆ ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాలున్నాయి.  ఎత్తిపోతల ద్వారా విద్యుదుత్పత్తి కోసం ప్రాజెక్టును వ్యాప్‌కోస్‌ ఏ విధంగా డిజైన్‌ చేసింది... భూగర్భంలో జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఏప్రాంతంలో ఏర్పాటు చేస్తారు? విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీరు గుంటవాడ జలాశయంలోకి ఏవిధంగా వెళుతుందన్న అంశాలపై à°ˆ బృందం ఆరా తీసింది. స్థానిక ఏపీ జెన్‌కో డ్యాం అండ్‌ పవర్‌హౌస్‌ ఇంజనీర్ల నుంచి à°† వివరాలను సేకరించి, వ్యాప్‌కోస్‌ డిజైన్‌ చేసిన మ్యాప్‌లను పరిశీలించింది. à°ˆ కార్యక్రమంలో ముంబయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు చెందిన ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేఎన్‌ మల్లికార్జునరావు, జనరల్‌ మేనేజర్‌ (రిటైర్డు) హెచ్‌ఎస్‌ హెగ్డే, పరిడాబాద్‌ ఎన్‌ఏపీసీకి చెందిన చీఫ్‌ ఇంజనీర్‌ (రిటైర్డు) ఎస్‌à°ˆ మిట్టల్‌తోపాటు స్థానిక జెన్‌కో ఏఈ à°¡à°¿. అప్పలనాయుడు, శర్మ తదితర్లు పాల్గ్గొన్నారు.