భారత సైన్యానికి అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ (ఎంకే-1ఏ)

Published: Sunday February 14, 2021

భారత దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా దృష్టి సారించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్‌ను భారత సైన్యానికి అప్పగించడంతోపాటు ఆయన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘సమైక్య భారత్’ స్ఫూర్తిని à°ˆ యుద్ధ ట్యాంకు చాటుతోందన్నారు. 

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ à°Žà°‚à°Žà°‚ నరవనేకు అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ (ఎంకే-1ఏ)ను అప్పగించారు. à°ˆ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశీయంగా డిజైన్ చేసి, తయారైన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ మార్క్-1ఏను భారత సైన్యానికి అప్పగించడం తనకు చాలా గర్వకారణమని తెలిపారు. మన దేశానికి ప్రధాన ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ తమిళనాడు అని పేర్కొన్నారు. ఇకపై తమిళనాడు మన దేశానికి యుద్ధ ట్యాంకుల తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పారు. తమిళనాడులో తయారయ్యే యుద్ధ ట్యాంకులు మన దేశ ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తాయన్నారు. ఇది ‘భారత దేశం సమైక్యం’ స్ఫూర్తిని వెల్లడిస్తోందన్నారు. 

 

రెండేళ్ల క్రితం జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాద దాడి జరిగిందని, à°ˆ దుర్ఘటనలో అమరులైనవారందరికీ నివాళులర్పిస్తున్నామని తెలిపారు. మన భద్రతా దళాలు మనకు గర్వకారణమని తెలిపారు. వారి ధైర్యసాహసాలు, పరాక్రమం తరతరాలను ప్రేరేపిస్తాయన్నారు. 

 

à°ˆ యుద్ధ ట్యాంకును చెన్నైలోనే తయారు చేశారు. దేశీయంగా డిజైన్ చేసి, అభివృద్ధిపరచి, తయారు చేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన కంబాట్ వెహికిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ) à°ˆ ట్యాంకును డిజైన్, డెవలప్, మాన్యుఫ్యాక్చర్ చేసింది. à°ˆ సంస్థ చెన్నైలో ఉంది. 

 

మోదీ ఆదివారం చెన్నై మెట్రో రైల్ ఫేజ్-1 విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల నగర ప్రజలకు రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడతాయన్నారు