7,569 కరోనా వైరస్ రకాలు

Published: Saturday February 20, 2021

 à°¡à±à°°à°¾à°—న్ కంట్రీ చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. కోట్లాదిమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన à°ˆ వైరస్ లక్షలాదిమందిని బలితీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులను మార్చేసింది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే.. ఇటీవలి కాలంలో వెలుగుచూసిన వైరస్‌లలో వేలాది రకాలు ఉన్న ఒకే ఒక్క అంటుజీవి ఇదే. 

 

à°ˆ వైరస్ వెలుగు చూసిన తర్వాత ఒక్క భారతదేశంలోనే ఏకంగా 7,569 కరోనా వైరస్ వేరియంట్లను విశ్లేషించడం గమనార్హం. దేశంలోని శాస్త్రవేత్తలు తగినన్ని నమూనాలను క్రమం చేయనప్పటికీ ఇన్ని రకాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల బృందం రీసెర్చ్ పబ్లికేషన్ ప్రకారం.. దేశంలో 7,569 కరోనా రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి.

 

 

సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఒక్కరే 5 వేల కరోనా వైరస్ రకాలను, అవి ఎలా ఉద్భవించాయన్న దానిని విశ్లేషించారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉద్ధృతంగా ఉన్నప్పటికీ, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో దాని ప్రభావం కొంత తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఇక, à°ˆ వేరియంట్లలో రోగ నిరోధకత నుంచి తప్పించుకునే E484K మ్యుటేషన్, N501Y మ్యుటేషన్ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. వీటిలో కొన్ని రకాలు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొన్నారు. 

 

ఏడాది క్రితం ఒక్కటిగా ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు లెక్కలేనన్ని వేరియంట్లుగా మారిపోయిందని డాక్టర్ మిశ్రా తెలిపారు. ఉదాహరణకు A3i వేరియంట్ ఉత్పరివర్తనాలు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయని ఊహించారు. అయితే, జూన్ 2020 నాటికి  D614G ఉత్పరివర్తనాలను మోస్తున్న, ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న A2a వేరియంట్‌ను ఇది అధిగమించిందని అధ్యయనం ధ్రువీకరించింది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది చాలాకాలం పాటు A2a వేరియంట్ ఆధిపత్యం కనబరించింది.