జేసీ దివాకర్‌రెడ్డిపై మహానాడు ఎఫెక్ట్‌.. ఫోన్ కూడా స్విచాఫ్!

Published: Wednesday June 06, 2018


ప్రస్తుతం ఆయన పేరు జిల్లాలో మారుమోగుతోంది. నలుగురు రాజకీయ నేతలు కలిసిన ప్రతి చోటా ఆయన ప్రస్తావన వస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు? నలుగురి నోళ్లలో ఆయన పేరు ఎందుకు నలుగుతోంది? ఆసక్తికరమైన కథనం మీకోసం!
 
        ఆయన శైలి విభిన్నం. మాట తీరు విలక్షణం. ఏ విషయమైనా సరే- కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తారు. ఆయనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. అలాంటి నేత అనంతపురం జిల్లాలో మరోసారి హాట్ టాపిక్‌à°—à°¾ మారారు. రాష్ట్ర మహానాడు వేదికగా ఆయన చేసిన ఉపన్యాసం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాము మాట్లాడలేని, చెప్పలేని విషయాలను ఆయన నిర్మొహమాటంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి హీరోగా మారారని జిల్లాకి చెందిన కొందరు టీడీపీ నేతలు కీర్తిస్తున్నారు. దీంతో మహానాడు తర్వాత జిల్లాకు వచ్చిన దివాకర్‌రెడ్డికి ఫోన్ల తాకిడి అధికమైంది. à°ˆ తాకిడి తట్టుకోలేక కొన్ని రోజులు లోకల్ నంబర్‌ని ఆయన స్విచాఫ్‌ చేశారట! ఢిల్లీ నంబర్ ఆన్‌లో పెట్టుకున్నారట. à°ˆ మాటని జేసీ అనుచరులే చెబుతున్నారు.
 
     à°œà±‡à°¸à±€ గురించి ఆయన అనుచరులు మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావిస్తున్నారు. జేసీ సూచనల మేరకే సీఎం చంద్రబాబు పాలనాపరమైన విషయాల్లో కొన్ని సంస్కరణలను తీసుకువచ్చారట. జన్మభూమి కమిటీల రద్దు, టెలికాన్ఫరెన్స్‌à°² తగ్గింపు వంటి చర్యలు జేసీ సూచనల తోనే చేపట్టారట. అధినేత వద్ద ఏ అంశమైనా చెప్పడానికి జేసీ సంకోచించరట. à°ˆ క్రమంలోనే ఆయన మహానాడు వేదికపైన à°…à°‚à°¤ ధైర్యాంగా మాట్లాడారన్నది జేసీ ఫ్యాన్స్‌ విశ్లేషణ!