వెంటాడుతున్నాయి.. వేధిస్తున్నాయి.

Published: Thursday June 07, 2018

కాజీపేట పట్టణంలో వీధికుక్కలు భయపెడుతున్నాయి. పాదాచారుల, వాహనచోదకుల వెంటపడుతున్నాయి. కాజీపేట చౌరస్తా సోమిడి రోడ్డుతో పాటు జూబ్లీ మార్కెట్‌, విష్ణుపురి, రహమత్‌నగర్‌, ఫాతిమానగర్‌, బాపూజీనగర్‌, ధర్గా తదితర ప్రాంతాల్లో కుక్కల సంచారం అధికంగా ఉంది. à°ˆ కుక్కల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. విష్ణుపురి వాసి అంకంరావు కుమారుడైన ప్రవీణ్‌ (10) చికెన్‌ పట్టుకుని ఇంటికి వెళ్తుండగా కుక్క దాడి చేసింది. చూపుడు వేలిని కొరికింది. ప్రవీణ్‌ అరుపులతో స్థానికులు అక్కడకు చేరుకుని కుక్కను తరిమివేశారు. ఇదే కాలనీకి చెందిన బి. సాయి అనే చిన్నారిపై, శారద అనే మహిళపై కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వీధికుక్కలు దాడి చేస్తున్నా యని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేట చౌరస్తా-సోమిడి రోడ్డులో, విష్ణుపురి ప్రాంతంలో రాత్రి వేళల్లో నడిచి వెళ్లాలంటేనే వణకు పుడుతోందని వాపోయారు. వీధికుక్కల బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు.