సీఐడీ విచారణలో స్పష్టం చేసిన రాజధాని రైతులు

Published: Friday March 19, 2021

రాజధాని అసైన్డ్‌ భూములపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ విచారణ చేపట్టింది. à°ˆ విచారణకు పలువురు రాజధాని దళిత రైతులు హాజరయ్యారు. తమ భూముల్ని రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామన్న రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్ని ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని రైతులు తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని రైతులు స్పష్టం చేశారు. భూముల విషయంలో నష్టపోయామని ఫిర్యాదు చేసిన కొందరి రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి దళిత జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడమంటే.. ఎస్టీ, ఎస్సీ చట్టాలను దుర్వినియోగం చేసినట్లేనని అన్నారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలో 41 జీవో ద్వారా చంద్రబాబు దళితుల అభివృద్ధికి పాటుపడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ హక్కు ప్రకారం ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెనక్కితీసుకోవాలని లేని పక్షంలో ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు. 

 

మరోవైపు అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడుపెంచారు. రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారిస్తున్నారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి à°—à°¤ నెల 24à°µ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... శుక్రవారం (ఈనెల 12à°¨) సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ à°•à°¿à°‚à°¦ నోటీసు ఇచ్చారు. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకున్నారు. à°† సమయంలో నివాసంలోనే ఉన్న చంద్రబాబు నోటీసులు అందుకున్నారు.