ముగ్గురు బాలురపై లైంగిక దాడి.. దారుణ హత్య

Published: Saturday March 20, 2021

 à°—ుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో అదృశ్యమైన కుర్రా భార్గవతేజ (6) మిస్సింగ్‌ కేసులో మిస్టరీ వీడింది. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన అదే గ్రామానికి చెందిన మెల్లెంపూడి గోపి (19)ని పోలీసులు అరెస్టు చేశారు. నిండా ఇరవయ్యేళ్లు కూడా నిండని నిందితుడిని విచారించగా షాకింగ్‌ నిజాలు వెలుగుచూశాయి. à°ˆ మేరకు శుక్రవారం పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఈశ్వరరావుతో కలిసి అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడు గోపిని మీడియా ఎదుట హాజరుపరచి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. à°ˆ నెల 14à°¨ భార్గవతేజ కనిపించటం లేదని ఫిర్యాదు అందగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. మరుసటి రోజు పోలీసు గాలింపులో ఇంటి సమీప పొలాల్లోనే భార్గవతేజ మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టు తేలింది. భార్గవ్‌ ఆడుకుంటుండగా, ఎవరూ లేని సమయంలో అతడిని బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలుడి శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు నలిపి.. రెండు చేతులూ, à°Žà°¡à°® కాలును విరిచేశాడు. 

 

వదిలేస్తే ఎవరికైనా చెబుతాడని.. గొంతు నులిమి చంపేసి, à°† తర్వాత మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. à°ˆ విషయం తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. à°ˆ విచారణలో.. రెండేళ్ల క్రితం దుగ్గిరాల పరిధిలోని రేవేంద్రపాడులోనూ à°“ బాలుడిపై నిందితుడు గోపి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే కేసు నమోదు కాలేదని తెలిసింది. అంతేగాక నెల రోజులక్రితం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి అఖిల్‌ అనే బాలుడిపైనా ఇదే తరహాలో లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అఖిల్‌ అదృశ్యంపై అప్పట్లో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా గోపి చేతిలో హతమైనట్లు తేలడంతో à°ˆ కేసు మిస్టరీ కూడా వీడిపోయింది. అఖిల్‌ మృతదేహం కోసం పోలీసు బృందాలను రంగంలోకి దించి బకింగ్‌హామ్‌ కాలువలో గాలిస్తున్నట్టు అర్బన్‌ ఎస్పీ తెలిపారు. కాగా, ఇలాంటి ఉన్మాదులు సమాజంలో ఉండటం అత్యంత ప్రమాదకరమని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి వ్యాఖ్యానించారు. నిందితుడి గోపి మానసిక ఉన్మాదిలా ఉన్నాడని, à°ˆ రెండు కేసుల్లో సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరించి 90 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేస్తామన్నారు. అంతేగాక న్యాయాధికారులతో చర్చించి నిందితుడు రిమాండ్‌లో ఉండగానే కేసు విచారణ పూర్తి చేసి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతడి తండ్రికి కూడా నేర చరిత్ర ఉందని, చిన్నతనం నుంచీ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటంతో గోపి ఉన్మాదిగా మారాడని పోలీసులు అంటున్నారు.