జీవో 72తో 6 వేల ఎకరాల పేదల భూములు లాక్కున్నారు

Published: Saturday March 27, 2021

భూ అక్రమాలంటూ వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా అమరావతి చుట్టూ తిప్పుతున్నారని.. కానీ అసలు భూ కుంభకోణం విశాఖలోనే ఉందని టీడీపీ ఆరోపించింది. ఇళ్ల స్ధలాల పేరుతో జీవో 72 ద్వారా à°† నగరం  చుట్టుపక్కల పేదల చేతిలో ఉన్న వేల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సింహభాగం తన చేతిలో ఉంచుకుందని పేర్కొంది. తమకు కావలసిన వారికి దానిని కట్టబెట్టడానికి పేదల నోళ్లు కొడుతోందని విమర్శించింది. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో à°† పార్టీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలకు భూమి అవసరమనే పేరు చెప్పి.. విశాఖ చుట్టుపక్కల ఆరు వేల ఎకరాలను లాండ్‌ పూలింగ్‌ విధానం à°•à°¿à°‚à°¦ సేకరించడానికి జీవో 72 జారీ చేసింది. ఇవన్నీ పేదలు సాగు చేసుకుంటున్న అసైన్‌మెంట్‌, ఇతర ప్రభుత్వ భూములు. పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పినా.. తీసుకుంటున్న భూమి మొత్తాన్ని పేదలకు ఇవ్వడం లేదు.

 

ప్రభుత్వం తన à°•à°¿à°‚à°¦ 30 నుంచి 40 లక్షల గజాల భూమిని ఉంచుకుంది. గజం కనీసం రూ.ఐదు వేలు వేసుకున్నా à°ˆ భూమి విలువ రూ. 15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు ఉంటుంది. ఇంత విలువైన భూమిని తమకు కావలసిన వారికి కట్టబెట్టడానికి పేదల నోరు కొట్టి లాక్కున్నారు. నిజంగా పేదవర్గాలపై ప్రేమ ఉంటే వారి నుంచి తీసుకున్న భూమి మొత్తాన్ని అదే పేద వర్గాలకు ఇవ్వకుం à°¡à°¾ గణనీయ భాగా న్ని ప్రభుత్వం తన వద్ద ఎందుకు ఉంచుకుంది? ఇది వారికి ద్రోహం చేయడం కాదా’ అని నిలదీశారు. సౌర ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల అసైన్డ్‌ భూములను సేకరించి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని, పేదల నోళ్లు కొట్టి పెద్దల ప్రయోజనాల కోసం పనిచేయడం వైసీపీ విధానంగా మారిందని విమర్శించారు. అమరావతిలో జీవో 41à°•à°¿ ముందు అసైన్డ్‌ భూములకు పరిహారం ఇస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పలేదని, అందువల్లే దళితులు వాటిని విక్రయించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణను నరేంద్ర తోసిపుచ్చారు.

 

‘సీఆర్‌డీఏ చట్టం వచ్చిన రెండు నెలలకే టీడీపీ ప్రభుత్వం 2015 జనవరి 1à°¨ జీవో నంబరు à°’à°•à°Ÿà°¿ జారీ చేసింది. అందులో అసైన్‌మెంట్‌ భూములను తీసుకుంటే à°† రైతులకు ప్రభుత్వపరంగా తిరిగి ఇచ్చే నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్ల గురించి సవివరంగా పేర్కొన్నారు. à°† తర్వాత 14 నెలలకు జీవో 41 జారీ అయుంది. à°ˆ మధ్యలో వివిధ వర్గాల వారి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని à°† పరిహారాన్ని మరింత పెంచుతూ à°ˆ జీవో ఇచ్చారు. పరిహారం పెంచడం దళితులకు మేలా... ద్రోహమా? పెంచితే తప్పేమిటి’ అని ఆయన ప్రశ్నించారు. తమను ఎవరూ బెదిరించలేదని,  ఇష్టపూర్తిగా తామే అమ్ముకున్నామని దళిత రైతులు బహిరంగంగా చెబుతున్నా.. వైసీపీ నేతలు బ్లూ మీడియాను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయసాయిరెడ్డిని విశాఖలో పెట్టి వీలైనన్ని భూములు అక్కడ కబ్జా చేసిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు.

 

అక్కడ భూములు ఎవరి పేరుతో రిజిస్టర్‌ అయ్యాయో.. ఏమేం లావాదేవీలు జరిగాయో విచారణ జరిపితే చాలా భాగోతాలు బయటకు వస్తాయని చెప్పారు. ప్రభుత్వానికి దమ్ముంటే దీనిపై విచారణకు ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. à°ˆ రాష్ట్రంలో ప్రతిదానినీ మింగేసే అనకొండలకు వైసీపీ ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ మారిందని, దీంతో ఏదీ మిగలడం లేదని నరేంద్ర వ్యాఖ్యానించారు. దశాబ్దాల కాలం నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు ఎంతో శ్రమపడి నిర్మించిన ప్రాజెక్టులు à°ˆ ప్రభుత్వం వచ్చాక గుజరాత్‌ నుంచి వచ్చిన అనకొండల నోట్లోకి వెళ్లిపోతున్నాయని విమర్శించారు.