భూసేకరణ ఎస్‌డీసీ కార్యాలయం ఖర్చు భరించలేం

Published: Sunday March 28, 2021

విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటుపరం చేసే ఏర్పాట్లు చాపకింద నీరులా సాగిపోతున్నాయి. ఇకపై ప్లాంటులో ఎవరికీ ఉపాధి లభించే అవకాశం లేదు. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకూ మొండిచేయి చూపించనున్నారు. నాడు స్టీల్‌ప్లాంటుకు అవసరమైన భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 16,500 మందిని గుర్తించి, వారందరికీ ‘రీహాబిలిటేషన్‌(ఆర్‌) కార్డులు’ ఇచ్చారు. à°ˆ కార్డు ఎవరి దగ్గర ఉంటే వారికి అవకాశాన్ని బట్టి ఉపాధి కల్పిస్తారు. ఆర్‌.కార్డులు పొందినవారిలో ఇంకా 7,500 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది.

 

నిర్వాసితుల వ్యవహారాలను చూడటానికి ‘స్టీల్‌ప్లాంటు భూసేకరణ విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌’ను జిల్లా యంత్రాంగం నియమించింది. à°ˆ అధికారికి జీతం, కారు, కార్యాలయం నిర్వహణకు ఏడాదికి రూ.70లక్షల వ్యయం అవుతుండగా, దానిని స్టీల్‌ప్లాంటే 40 ఏళ్లుగా భరిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా à°ˆ వ్యయం భరించలేమని, కార్యాలయాన్ని జిల్లా భూసేకరణ విభాగంలో కలిపేసుకోవాలని సూచిస్తూ జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ప్లాంటు యాజమాన్యం వారం క్రితం లేఖ రాసింది. à°ˆ కార్యాలయం ప్రస్తుతం జిల్లా పరిషత్‌ జంక్షన్‌ సమీపాన ఉంది. 

స్టీల్‌ప్లాంటుకు భూములు ఇచ్చిన రైతుల్లో చాలామంది చనిపోయారు. వారి వారసులు ఆర్‌.కార్డులు తీసుకుని à°ˆ కార్యాలయానికి వస్తే అన్ని ధ్రువపత్రాలు పరిశీలించి, వారి పేర్లు నమోదు చేస్తుంటారు. స్టీల్‌ప్లాంటు ప్రకటించే ఉద్యోగాల్లో చదువు, అర్హతను బట్టి నిర్వాసితుల కోటా మేరకు సీరియల్‌ ప్రకారం అర్హులైన వారి జాబితాను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరే పంపుతుంటారు. à°† మేరకు ఆర్‌.కార్డుదారులకు ఉద్యోగాలు లభిస్తాయి. భూములిచ్చి 40ఏళ్లు అయినా ఇప్పటి వరకూ సగంమందికే ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు కాకపోతే రేపయినా ఉద్యోగం వస్తుందనే ఆశతో మిగిలిన కుటుంబాలు à°ˆ కార్యాలయం చుట్టూ ఆశగా తిరుగుతున్నాయి. వీరి రికార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి.

 

ఇప్పుడు దీనిని ఎత్తివేస్తే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి. స్టీల్‌ప్లాంటును 100శాతం అమ్మేయాలని నిర్ణయించారు కాబట్టి కొత్తగా వచ్చే యాజమాన్యం వీరికి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించదు. అంటే వీరందరికీ అన్యాయం జరిగినట్టే. నేరుగా à°† విషయం చెప్పకుండా, ముందు జాగ్రత్తగా à°† కార్యాలయం ఖర్చు భరించలేమని, ఎత్తేయాలని ప్లాంటు అధికారులు లేఖ రాశారు. దీనివల్ల 7,500మందికి ఉపాధి దక్కని పరిస్థితి ఏర్పడింది.