ఉపాధి, ఆదాయం, ఉత్పత్తిని బట్టే ప్రోత్సాహకాలు

Published: Thursday April 01, 2021
 

అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): à°•à°¡à°ª ఉక్కు కర్మాగారం నిర్మాణ బాధ్యతల నుంచి.. దివాలా తీసిన లిబర్టీ సంస్థ వైదొలిగినట్లేనని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. à°† సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. దానితో ప్రభుత్వం ఎలాంటి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోలేదని.. కేవలం చర్చలే జరిగాయని తెలిపారు. ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్‌ఎ్‌ఫసీ) ప్రక్రియలో ఎల్‌-2à°—à°¾ నిలిచిన ఎస్సార్‌ స్టీల్స్‌ సహా.. మరికొన్ని సంస్థల పేర్లను à°•à°¡à°ª స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటులో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బుధవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. à°•à°¡à°ª స్టీల్‌ ప్లాంట్‌ను రాష్ట్రప్రభుత్వమే స్థాపించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా.. సామాజిక, ఆర్థికాంశాలను పరిగణనలోకి తీసుకుని దాదాపు 15,000 మందికి ఉపాధి కల్పించే స్టీల్‌ ప్లాంట్‌ను కడపలో ఏర్పాటు చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని.. అందుకే రూ.10,000 కోట్లను రాష్ట్రప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనకు మొగ్గు చూపుతున్న ‘పోస్కో’.. à°•à°¡à°ª జిల్లాలో పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.

 

స్విట్జర్లాండ్‌కు చెందిన à°“ సంస్థ సంసిద్ధత  వ్యక్తం చేసినా.. డీపీఆర్‌తో ముందుకు రాలేదని తెలిపారు. à°ˆ ఏడాది జూన్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగే వీలున్నందున.. మే నెలలో నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంతో పారిశ్రామిక సదస్సు జరుపుతామన్నారు. కర్నూలు జిల్లా కొసిగి ఎలకా్ట్రనిక్‌ క్లస్టర్‌కు కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ ఆమోదం తెలిపిందని.. రూ.350 కోట్లు విడుదల చేసిందని.. రాష్ట్రం మరో రూ.350 కోట్లు తన వాటాగా విడుదల చేయాల్సి ఉందన్నారు. à°ˆ క్లస్టర్‌లో కార్యకలాపాలు చేపట్టేందుకు డిక్సన్‌ సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు.

పరిశ్రమలు కల్పించే ఉపాధి, ఆదాయం, ఉత్పత్తిని బట్టే ప్రోత్సాహకాలుంటాయని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. వీటి చెల్లింపులో ఎక్కువ ఆలస్యం కాకుండా చూడాలన్నారు. à°—à°¤ ప్రభుత్వ బకాయిలు, ప్రస్తుత సర్కారు బకాయిలు కలిపితే మొత్తం రూ.4,923 కోట్లు చెల్లించాలన్నారు. ఖజానాలో డబ్బులు లేకపోయినా ప్రతి ఆరునెలలకోసారి సమీక్షించి ప్రాధాన్య క్రమంలో చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామని సమీక్ష సందర్భంగా చెప్పారు. ఇప్పటికే రీస్టార్ట్‌ ప్యాకేజీ à°•à°¿à°‚à°¦ ఎంఎ్‌సఎంఈల బకాయిలు చెల్లించామన్నారు. సెప్టెంబరులో టెక్స్‌టైల్స్‌ కంపెనీల ప్రోత్సాహకాలు చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సీఎ్‌ఫఎంఎ్‌సలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రమణ్యం వివరించారు. సమీక్షలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, సలహాదారు లంకా శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.