బహిరంగ సభలో వ్యక్తిగత వైద్యుల్ని కోరిన మోదీ

Published: Saturday April 03, 2021

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం అసోంలో పర్యటించారు. తమూల్ పూర్ నియోజకవర్గంలో జరిగిన à°“ ర్యాలీలో పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా à°“ సన్నివేశం చోటుచేసుకుంది. బహిరంగ సభలో పాల్గొన్న à°“ బీజేపీ కార్యకర్త హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ‘డీహైడ్రేషన్’ తో బాధపడ్డారు. దీన్ని గమనించిన మోదీ... ఆయనకు వైద్యం చేయాలంటూ పీఎంవో వైద్య బృందాన్ని కోరారు. ‘నాతో పాటు వచ్చిన వైద్యులారా (పీఎంవో వైద్యులు).... దయచేసి à°† కార్యకర్త వద్దకు వెళ్లండి. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దయచేసి పరీక్షించండి. వెంటనే సహాయం చేయండి.’’ అని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా, ఆయన వెంట నలుగురు వ్యక్తిగత వైద్య సిబ్బంది వెంట వెళ్తారు.