జవాన్ల త్యాగాలు వృథా కానీయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా

Published: Sunday April 04, 2021

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ నక్సల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలు వృథా కానీయమని వారి కుటుంబ సభ్యులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌à°·à°¾ భరోసా  ఇచ్చారు. జాడ తెలియకుండా పోయిన జవాన్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. 'ఇరువైపులా నష్టం జరిగింది. మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పిస్తున్నాను. అలాగే జవాన్ల త్యాగాలు వృథా కానీయమని వారు కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నాను' అని అమిత్‌à°·à°¾ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అదివారం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరారు.

 

 

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో సుమారు 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని బిజాపూర్ ఎస్‌పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. సుమారు 31 మంది à°ˆ ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్టు చెప్పారు. 

 

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యావద్దేశం à°ˆ దాడి ఘటనపై విచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రియాంక గాంధీ à°’à°• ట్వీట్‌లో పేర్కొంటూ, అమరజవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని, à°ˆ కష్టకాలంలో జవాన్ల కుటుంబ సభ్యులకు మనఃస్థైర్యం ప్రసాదించాలని à°† భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు.