భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published: Monday April 05, 2021

 à°­à°¾à°°à°¤ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి.  కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. 24 గంటల్లో లక్ష కేసులకు పైగా నమోదు కావడంతో అమెరికా తర్వాత అత్యధిక కొవిడ్ కేసులు నమోదైన దేశంగా భారత్ నిలిచింది. à°ˆ నేపథ్యంలో ఫైనాన్సియల్ స్టాక్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.  దీంతో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 870.51 పాయింట్లు (1.74 శాతం) క్షీణించి 49,159.32  వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 229.55 పాయింట్లు (1.54 శాతం) నష్టపోయి 14,637.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ దాదాపు 6 శాతం మేర అత్యధికంగా నష్టపోగా... తర్వాతి స్థానాల్లో ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు ఉన్నాయి.