-515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ

Published: Thursday April 08, 2021

రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ మంగళవారం స్టే ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్నం వరకు సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లాలని సిబ్బందికి ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న సందేహాలతోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ బూత్‌లకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం డివిజన్‌ బెంచ్‌ సదరు స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో పరిషత్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు à°—à°¤ ఏడాది మార్చి 7à°¨ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. అదే నెల 14à°¨ రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించారు. కొవిడ్‌ ఉధృతి కారణంగా అదే నెల 15à°¨ నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌  ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత కొత్త ఎన్నికల కమిషనర్‌à°—à°¾ నియమితులైన మాజీ సీఎస్‌ నీలం సాహ్ని à°ˆ నెల ఒకటో తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి ప్రారంభిస్తూ.. 8à°¨ పోలింగ్‌, 10à°¨ కౌంటింగ్‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీచేశారు. 4 వారాల కోడ్‌ను అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదంటూ టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్నికలు నిలుపుదల చేస్తూ  6à°¨ సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలిచ్చింది. డివిజన్‌ బెంచ్‌ బుధవారం à°† స్టేను ఎత్తివేసింది. దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు గురువారం పోలింగ్‌ జరుగనుంది.

 

13 జిల్లాల్లో 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు.. పోటీలో ఉన్న వివిధ పార్టీల తరఫు అభ్యర్థులు 11 మంది మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు. అదే విధంగా 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. 375 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.