గత నెలతో పోలిస్తే భారీగా యాక్టివ్‌ కేసుల

Published: Wednesday April 14, 2021

జిల్లాలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. à°—à°¤ నెలాఖరు వరకు పదుల సంఖ్యలో వున్న యాక్టివ్‌ కేసులు...ప్రస్తుతం వందల్లోకి చేరుకున్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో యాక్టివ్‌ కేసులు శరవేగంగా పెరుగుతుండడంపై వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

 

మార్చి ఒకటో తేదీన కనిష్ఠ స్థాయిలో ఒకే ఒక్క కొవిడ్‌ కేసు నమోదైంది. అప్పటికి జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 మాత్రమే. à°† తరువాత నుంచి క్రమేణా పెరగడం ప్రారంభించాయి. మార్చి నెల ఆరో తేదీన 18, 13à°¨ 20  కేసులు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్‌ ఒకటో తేదీన ఏకంగా 189 కరోనా కేసులు నమోదు కావడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,342కు చేరింది. మార్చి ఒకటో తేదీతో పోలిస్తే à°ˆ సంఖ్య 56 రెట్లు అధికం. అలాగే, à°ˆ నెల ఆరో తేదీన మరోసారి గరిష్ఠ స్థాయిలో 258 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,774కు చేరింది. à°—à°¤ నెల 13 నాటికి జిల్లాలో 94 యాక్టివ్‌ కేసులు ఉండగా, à°ˆ నెల పదమూడవ తేదీ నాటికి 32 రెట్లు పెరిగి 3,051కు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్టివ్‌ కేసులు రోజుల వ్యవధిలోనే వందల్లోకి చేరుకోవడం చాలా ఆందోళన కలిగించే అంశంగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

 

ప్రస్తుతం జిల్లాలో 3,051 మంది కరోనా వైరస్‌తో బాధపతుతూ చికిత్స పొందుతున్నారు. వీరిలో సుమారు వేయి మంది వరకు మాత్రమే ఆస్పత్రుల్లో ఉండగా, మరో రెండు వేల మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే వున్నారని అధికారులు చెబుతున్నారు. కేజీహెచ్‌లోని సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 380 మంది, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో 60 మంది, నర్సీపట్నం, అనకాపల్లి, అరకు, పాడేరు ఆస్పత్రుల్లో కలిపి 60 మంది చికిత్స పొందుతున్నారు. 

 

జిల్లాలో యాక్టివ్‌ కేసులు భారీగా పెరుగుతుండడంతో కొవిడ్‌ బెడ్స్‌ను పెంచడంపై అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం నగర పరిధిలో కేజీహెచ్‌లో 500, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో మరో 200 వరకు పడకలు మాత్రమేఅందుబాటులో ఉండగా, విమ్స్‌లోనూ మొదటి దశలో వంద పడకలను సిద్ధం చేస్తున్నారు. అయితే, వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా వున్నందున మరిన్ని పడకలు సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. విమ్స్‌లో మరో 550 పడకలు సిద్ధం చేయడంతోపాటు నగర పరిధిలో à°—à°² ఇతర ప్రభుత్వ ఆస్పత్రులను కూడా రెడీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందించే విషయంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.