కడపకి నీలు వచ్చాయి అని ఆనందం వ్యక్తం చెసిన సిఎం

Published: Thursday January 04, 2018

à°•à°¡à°ª - పులివెందుల-న్యూస్‌: చెప్పింది చెసి చూపించినందుకు చాల ఆనదంగా ఉంది అని చంద్రబాబునాయుడు గారు నిన్న à°•à°¡à°ª జిల్లాలొ పులివెందుల గ్రమంలొ జరిగిన సభలొ పెర్కొన్నారు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కంటే ముందే పులివెందులకు నీరిచ్చి మాట నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొందరు అడ్డుకునె ప్రయత్నాల్లొ  à°•à±‹à°°à±à°Ÿà±à°•à±†à°•à±à°•à°¿à°¨à°¾, కాంట్రాక్టర్లు మొండికేసినా వెనక్కి తగ్గకుండా గట్టిగా నిలబడి సాధించుకున్నామన్నారు. తన పట్టు ఉడుంపట్టులా ఉంటుందని చెప్పుకొచ్చారు. తెదేపా ప్రభుత్వ కష్టానికి ఫలితమే అంటూ  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ రాయలసీమ జిల్లాల్లోని జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలని ఉద్దెశించి చెప్పారు. à°•à°¡à°ª జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఆయన పులివెందుల, లింగాల మండలాల్లో బుధవారం పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లెలో పైలాన్‌ ఆవిష్కరించి గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కృష్ణా జలాలకు హారతి, సారె సమర్పించిన అనంతరం సభలో ప్రసంగించారు. పులివెందులలో ఆయన మట్లాడుతూ 
రాయలసీమలో కరవు తో ఏళ్ల తరబడి నీళ్లు లేక అలమటించిన à°ˆ ప్రాంతంలో ఇంత ఎక్కువగా నీళ్లు చూడడం ఆనందంగా ఉందన్నారు. తుంగభద్ర నీరు తక్కువగా వచ్చే సమయంలో ఎన్టీఆర్‌ చొరవ చూపి జీఎన్‌ఎస్‌ఎస్‌, గండికోట వంటి కీలక పథకాలకు బీజం వేసినట్లు చెప్పారు. తన హయాంలో à°† పనులను వేగవంతం చేసి అనుకున్నది సాదించుకున్నాం అని ఆయన వివరించారు. కొందరు అభివృద్ధికి అడ్డం పడినా కాలువల దగ్గర పడుకుని కాపలాగ మారి మరీ à°ˆ పధకాన్ని పూర్తిచేసినట్లు స్పష్టం చేశారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామన్న ఆయన పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు తెచ్చి రుణం తీర్చుకున్నట్లు వివరించారు. ‘‘నీళ్లు బంగారం చాలా విలువైనవి అంటూ.. అవి ఉంటేనే అభివృద్ధికి అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు

. తాను సీమకు నీళ్లు తెస్తోంటే కొందరు ఎగతాళి à°—à°¾ మాట్లాడరని.. ఇప్పుడు à°ˆ నీళ్లను చూసి వారు ఏం అనగలరు అని చంద్రబాబు ప్రశ్నించారు. 105 టీఎంసీల నీరు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తెచ్చి .. కృష్ణా నీటిని శ్రీశైలం వద్ద పొదుపుచేసి, రాయలసీమ, నాగార్జునసాగర్‌కు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కొందరు తప్పుడు వ్యాక్యాలు చెస్తు ఆడుతూ రాజకీయం చేయడం దారుణమని నిలదీశారు. à°•à°¡à°ª జిల్లా ఉద్యానసాగులో విప్లవాలు సృష్టిస్తోందన్న ఆయన.. à°…à°°à°Ÿà°¿, బత్తాయి, బొప్పాయి తదితర అనుబంధ పరిశ్రమలకు వచ్చెలా కృషి చేస్తామన్నారు. à°—à°¤ ఏడాది వ్యవసాయంలో 14 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తే à°ˆ సారి మొదటి అర్ధ సంవత్సరంలోనే 25.6 శాతం వృద్ధి సాధించామన్నారు. దేశ స్థాయిలో 2.5 శాతంగా నమోదైనట్లు స్పష్టం చేశారు. రైతు కుటుంబంలో పుట్టిన తాను రైతులకు మంచి చేయాలని ఎలప్పుడు ప్రయత్నిస్తున్నానని, రాయితీలు ఇస్తున్నానని వివరించారు. ఒకప్పుడు రాయలసీమలో ముఠాకక్షలు ఉండేవని, వాటి నిర్మూలనకు తీవ్రస్థాయిలో ప్రయత్నించామన్నారు. మొత్తం 19 లక్షల ఇళ్లు కడుతున్నామని, సంక్రాంతి తర్వాత 2.50 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామన్నారు.