‘అడ్డసరం’ అనే మొక్కలో కరోనా ఇన్ఫెక్షన్ తగ్గించే లక్షణాలు

Published: Monday April 19, 2021

కరోనాపై పోరులో కొత్త కొత్త పరిశోధనలకు శాస్త్రవేత్తలు తెరలేపుతున్నారు. తాజాగా ఔషధ గుణాలు కలిగిన ‘అడ్డసరం’ అనే మొక్కలో కరోనా ఇన్ఫెక్షన్ తగ్గించే లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. వైరల్ లోడ్‌ను సైతం తగ్గిస్తుందంటున్నారు. ఢిల్లీలోని ఆయుర్వేద రెస్పిరేటరీ రీసర్చ్ సెంటర్ ఫర్ అప్లాయిడ్ డెవలప్‌మెంట్ అండ్ జీనోమీన్స్ ఐజీ ఐబీ వంటి జాతీయ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి.

 

à°ˆ నేపథ్యంలో ఫలితాలు సానుకూలంగా రావడం ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా రోగులకు ఉపయోగించే మందుల తయారీకి ‘అడ్డసరం’ వాడుతున్నారు. దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును మందుల తయారీలో విరివిగా వాడుతుంటారు. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం నివారణ, చర్మ వ్యాధుల చికిత్సలకు దీన్ని వినియోగిస్తారు.