కొన్ని సంస్థల ఉద్యోగులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు

Published: Sunday April 25, 2021

రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. రాత్రి 10 à°—à°‚à°Ÿà°² నుంచి ఉదయం 5 గంటలకు à°ˆ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే, అత్యవసరసేవలు సహా మీడియా, కొన్ని సంస్థల ఉద్యోగులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఆదిత్యనాథ్‌ కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలతో శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు à°ˆ కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీఎస్‌ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 à°—à°‚à°Ÿà°² వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసే నిరంతర ప్రక్రియలో భాగంగా కొవిడ్‌ బాధితులకు చికిత్సను అందించడం, పరీక్షలు చేయడం వంటి ప్రక్రియలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మాస్కును మించిన ఆయుధం లేదని, పగటి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో సంచరించేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పరిస్థితులను సమీక్షించిన తర్వాతే రాత్రి కర్ఫ్యూ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాలు, వినోద సంస్థలు పూర్తిగా మూసివేయాలని పేర్కొన్నారు. 

 

అత్యవసర విధులకు వెసులుబాటు

-ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛనిస్తారు

-బ్రాండ్‌ కాస్టింగ్‌, కేబుల్‌ సర్వీసు, ఐటీ, ఐటీ అధారిత సర్వీసులకు అనుమతి ఉంటుంది

-టెలీకమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌, బ్రాడ్‌ బాండ్‌ సేవలకు అనుమతి

-విద్యుత్తు, సరఫరా, పంపిణీ వ్యవస్థలకు వర్తించదు

-నీటి సరఫరా మురుగునీటి వ్యవస్థ సిబ్బందికి అనుమతి

-కోల్డ్‌ స్టోరేజీ, వేర్‌ హౌసింగ్‌ సంస్థల సేవలకు కర్ఫ్యూ వర్తించదు

-ఉత్పత్తి సంస్థలకు కూడా అనుమతి

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పట్టణ, పంచాయతీ సంస్థల ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందికి అనుమతి

-మెడికల్‌ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆసుపత్రులకు వర్తించదు

-గర్భిణులు, రోగులకు వైద్య సేవల కోసం అనుమతి

-ముందుగా టెకెట్లు తీసుకుని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లకు వెళ్లేందుకు అనుమతి

-రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ ఉత్పత్తుల సరఫరాకు ఓకే

-పైన పేర్కొన్న సేవలకు చెందిన ఆటోలు, కార్లు తిరిగేందుకు అనుమతి

-కర్ఫ్యూ నింబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయి. 

-నిబంధనలు అతిక్రమించేవారిపై విపత్తుల నివారరణ చట్టం సెక్షన్‌ 51 నుంచి 60కు లోబడి à°•à° à°¿à°¨ శిక్షలు 

-జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కర్ఫ్యూ పర్యవేక్షణ బాధ్యత