ఆక్సిజన్‌ అందక ఇద్దరు మృతి?

Published: Wednesday April 28, 2021

రాష్ట్రంలో కరోనా వీరంగం కొనసాగుతూనే ఉంది. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,435 శాంపిల్స్‌ను పరీక్షించగా 11,434 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయిందని, అన్ని జిల్లాల్లో కలిపి 64 మంది కరోనాతో మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 2,028 మంది వైరస్‌ బారినపడగా.. చిత్తూరులో 1,982, శ్రీకాకుళంలో 1,322, నెల్లూరులో 1,237, విశాఖపట్నంలో 1,067, అనంతపురంలో 702 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 99,446 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో 8 మంది చనిపోయారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిల్లో నలుగురు చొప్పున, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాలు 7,800à°•à°¿ పెరిగాయి. 

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు తొలుత హైదరాబాద్‌లోని à°“ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు జయమనోజ్‌రెడ్డి తెలిపారు. 

à°•à°¡à°ª జల్లా ప్రొద్దుటూరులో కొవిడ్‌తో ఒకరు, ఆస్తమాతో ఒకరు మృతిచెందారు. అయితే వారి మృతికి ఆక్సిజన్‌ అందకపోవడమే కారణమని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నారాయణ (74)కరోనాతో, చాపాడు మండలానికి చెందిన రామలక్షుమ్మ (70) ఆస్తమాతో రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు జల్లా ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరూ మంగళవారం ఉదయం చనిపోయారు. తెల్లవారుజామున నర్సులు తమకు ఫోన్‌ చేసి.. ఆక్సిజన్‌ సరఫరాలో సమస్య వచ్చిందని, వెంటనే మీ వాళ్లను వేరే ఆస్పత్రికి తీసుకుపోవాలని చెప్పారని కుటుంబసభ్యులు అన్నారు. తాము అంబులెన్స్‌ సిద్ధం చేసుకుని వచ్చేటప్పటికే వారు మృతి చెందారని, ఆక్సిజన్‌ అందకే వారు చనిపోయారని ఆరోపించారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీప్రసాద్‌ వారిమృతికి ఆక్సిజన్‌ అందకపోవడం కారణం కాదన్నారు.  విశాఖ కేజీహెచ్‌లో కరోనా బాధితుడు వెంకట్రావు (41) నాలుగో అంతస్థు à°•à°¿à°Ÿà°¿à°•à±€ నుంచి కిందపడి చనిపోయారు. పోలీసులు ప్రమాదంగా కేసునమోదు చేశారు.