ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Published: Wednesday April 28, 2021

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ రోగులకు అందుతున్న చికిత్సపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త తోట సురేష్‌, ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స, ఫీజుల వసూలు, ఇతర అంశాలపై వెంటనే ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. ఆస్పత్రుల్లో రోగులు, ఖాళీల వివరాలపై డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, రెమ్‌డెసివిర్‌, అత్యవసర మందులపై రోజువారీ సమీక్ష ఉండాల్సిందేనని హైకోర్టు సూచించింది. ఆక్సిజన్‌ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విచారణలో పేర్కొంది. ఆక్సిజన్‌ కొరతపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని కూడా తెలిపింది. రాష్ట్రంలో ఐసోలేషన్‌ కేంద్రాలను పెంచంచాలని హైకోర్టు సూచించింది. అలాగే పడకల సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకోవాలని పేర్కొంది.