కక్కుర్తి పడుతున్న ప్రైవేట్‌ స్కూళ్ల ............

Published: Monday June 11, 2018

విద్యార్థుల ప్రాణాలతో ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలు చెలగాటమాడుతున్నాయి. వారి భద్రతను ఏ మా త్రం పట్టించుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాన్లు, ఆటో డ్రైవర్ల చేతుల్లో పెడుతున్నాయి. రూ. వేలల్లో ఫీజులు వసూలు చేసి ఆటోల్లో, మినీ వ్యాన్లలో విద్యార్థులను తరలిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ వీధుల్లోకి వచ్చే ఆటోలు, మినీ వ్యాన్ల వారితో మాట్లాడుకొని స్కూళ్లకు సంబంధం లేకుండానే పిల్లలను బడికి పంపిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో వందల సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. స్కూలు బస్సులతో పాటు ప్రస్తుతం వ్యాన్లు, ఆటోల్లోనూ విద్యార్థులను తీసుకువెళుతున్నారు. విద్యార్థులను తరలించడంలో ప్రత్యేక నిబంధనలను పాటించాల్సిన వాహనాల నిర్వాహకులూ వాటిని బేఖాతరు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందిని తీసుకు వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారే తప్ప, భద్రత విషయంలో రవాణా శాఖ, ట్రాఫిక్‌ పోలీసుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.