బీమా ధీమా....బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా అర్హులే

Published: Saturday June 16, 2018
తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనం ఉన్న బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.12తో సురక్ష, రూ.330తో జీవన్‌జ్యోతి పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి వర్తింపజేసేందుకు నిర్ణయించారు. తొలుత జిల్లాలో 651 గ్రామాలను వర్తింపజేసేందుకు బ్యాంకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. à°ˆ గ్రామాల్లో గ్రామ స్వరాజ్‌ యోజన పథకం à°•à°¿à°‚à°¦ శత శాతం ప్రజలకు జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు... లేకుంటే ఏదో à°’à°• బ్యాంకు ఖాతా ఉండేలా చర్య లు తీసుకుంటారు. వీటి ద్వారా సురక్షా బీమా యోజన అమలు చేస్తారు.అంటే బ్యాంకు ఖాతాదారుని నుంచి రూ.12 అతి స్వల్ప ప్రీమియం కట్టించి బీమాను ప్రా రంభిస్తారు. పాలసీదారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షలను బాధిత కుటుం బానికి అందిస్తారు. రూ.330 ప్రీమియం à°—à°¾ చెల్లిస్తే జీవన్‌ జ్యోతి పాలసీని వర్తిం పజేస్తారు. పాలసీదారు సాధారణ మర ణం చేందినా à°† కుటుంబాలకు రూ.2 లక్షలు నగదు అందిస్తారు.
 
 
విజయనగరం జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 651 గ్రామాల్లో ఆగస్టు 15లోగా ప్రీమియం చెల్లింపును పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులను ఆదేశించింది. దీంతో గ్రామస్థాయిలో మహిళా సంఘాలు, సాక్షరభారత్‌ కోఆర్డినేటర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను వినియోగించుకోవడం ద్వారా బ్యాంకు ఖాతాలు తెరవడం, బీమా ప్రీమియం కట్టించుకోవడం తదితర వాటిని పూర్తిచేయాలని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. సురక్ష పాలసీకి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్నవారు.... జీవన్‌ జ్యోతి పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు అర్హులు. à°ˆ అవకాశాన్ని ఎంపిక చేసిన గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గురవయ్య కోరారు.